ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

విశాఖలోని టిఫెన్ సెంటర్ వద్ద భారీ పేలుడు

Share

విశాఖ ఆటోనగర్ లో భారీ పేలుడు సంభవించింది. ఒక టిఫిన్ సెంటర్ వద్ద ఈ పేలుడు జరిగింది. టిఫెన్ సెంటర్ పక్కనే ఉన్న పాన్ షాపు నుండి ఈ పేలుడు సంభవించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ భారీ పేలుడుతో టిఫెన్ సెంటర్ లో ఉన్న సామాగ్రి మొత్తం ధ్వంసం అయ్యింది. ఈ పేలుడుతో అక్కడ ఉన్న ప్రజలు పలుగురు తీశారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. అక్కడి ప్రహరీగోడ కూడా ధ్వంసమయ్యింది. పేలుడు సంభవించిన వెంటనే కొందరు కరెంట్ సరఫరా నిలిపివేశారు. పేలుడు ఎలా సంభవించింది అనేది ఇంకా తెలియరాలేదు.

 

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనతో విశాఖ వాసులు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైయ్యారు. తొలుత గ్యాస్ సిలెండర్ పేలుడుగా భావించినా .. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటం, పాన్ షాప్ నుండి పేలుడు రావడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Share

Related posts

Daily Horoscope జూలై 27 సోమవారం మీ రాశి ఫలాలు

Sree matha

టిటిడి చైర్మన్ పదవికి సుధాకర్ యాదవ్ రాజీనామా

somaraju sharma

లోక్ సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు

Siva Prasad