NewsOrbit
న్యూస్

రెబల్ -గుబుల్ :జనసేనకు రాపాక ! టిడిపికి ఈ ఎమ్మెల్యే !!

జనసేన కున్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ కి కొరుకుడుపడని కొయ్యగా మారితే,టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఒక మహిళా ఎమ్మెల్యే తీవ్రమైన టెన్షన్ కలిగిస్తోంది. ఏపీ రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాలుగు చెల్లని ఓట్లు పోలయ్యాయి. మొదటి ప్రాధాన్యత వద్ద “1” అని నెంబర్ వేయకుండా కొందరు టీడీపీ నేతలు టిక్ మార్క్ పెట్టారు. ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, చీరాల శాసన సభ్యుడు కరణం బలరాం ఈ చెల్లని ఓట్లు వేసినట్లు ఎన్నికల అధికారులు గుర్తించారు. అది ఆల్ రెడీ ఊహించిన విషయమే కావడంతో.. పెద్దగా ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు.


ఈ క్రమంలో నాలుగో నేత ఎవరబ్బా అని అంతా ఆసక్తిగా ఎదురుచూసిన క్రమంలో… అది కూడా టీడీపీకి చెందిన ఎమ్మెల్యేనే అని.. ఆ పేరు ఆదిరెడ్డి భవాని అని తేల౦ది. పై మూడు పేర్లూ అంతా ఊహించినవే కానీ.. నాలుగో పేరు మాత్రం ఎవ్వరూ ఊహించకపోయే సరికి.. రాజకీయ వర్గాల్లో రకరకాల విశ్లేషణలు వెలుగులోకి రావడం మొదలయ్యాయి.ఆమె కావాలనే ఇలా చేసిందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనికి తోడు ఇటీవలే ఆమె సోదరుడు అచ్చన్నాయుడు అరెస్ట్ తో జగన్ కి ఎదురు నిలిచి పోరాడితే కేసులు తప్ప మరేమి ఒరిగేదేమి లేదని టిడిపి లో మరో చర్చ నడుస్తున్న క్రమంలో… భవానీ కావాలనే ఇలా చేశారని అంటున్నారు!!ఈ విషయాలపై స్పందించిన భవానీ… ఓటింగ్ సమయంలో అక్కడ ఉండే వ్యక్తి ఇచ్చిన వివ‌ర‌ణ‌లో వ‌చ్చిన‌ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల పొరపాటు జరిగిందని వెల్ల‌డించారు! ఇది వినడానికి బాగానే ఉన్నా నమ్మశక్యంగా మాత్రం అనిపించడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అదే సమయంలో భవానీ మామగారు ఆదిరెడ్డి అప్పారావుకు వైసీపీతో గల సంబంధాలపైనా చర్చ నడుస్తోంది.ఏపీ లో తొలి ఎమ్యెల్సీ గా వైఎస్ జగన్ గతంలో ఎంపిక చేసింది ఆదిరెడ్డి అప్పారావును! ఆయన ఆదిరెడ్డి భవాని కి స్వయాన మామ గారు.ఈయనకు అటు టిడిపి, ఇటు వైసిపి లో కూడా సత్సంబంధాలే ఉన్నాయి!ఇటీవలి కాలంలో ఆదిరెడ్డి కుటుంబం రాజకీయంగా మైనస్లో ఉన్న నేపథ్యంలో ఆయన వైసీపీ వైపు చూస్తున్నారన్న టాక్ ఉంది.దీనికి భవానీ చెల్లని ఓటు వేయడానికి లింకు పెడుతున్నారు.ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ ఆఫర్ ను అందుకుని మరోసారి పార్టీ మారడమా లేక జనసేన ఎమ్యెల్యే రాపాక వరప్రసాద్ లా విపక్ష పార్టీలో ఉంటూనే అధికారపార్టీకి కొన్ని విషయాల్లో ప్రత్యక్షంగా, మరికొన్ని విషయాల్లో పరోక్షంగా సహకరించడ౦ వంటి ఆప్షన్లను ఆదిరెడ్డి భవాని కుటుంబం పరిశీలిస్తోందని తెలుస్తోంది





    

author avatar
Yandamuri

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju