ఎన్.టి.ఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా భారీ స్థాయిలో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ కి జంటగా బ్రిటన్ బ్యూటీ ఒలియా మోరెస్ నటిస్తుంది. కొమరం భీం పాత్రలో సత్తా చాటడానికి ఈ సినిమాలో చాలా శ్రమిస్తున్నాడు. ఇక ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తన నెక్స్ట్ సినిమాని ఒకే చేశాడు.
మాట మాంత్రీకుడు అరవింద సమేత వీర రాఘవ తో తారక్ కి సూపర్ హిట్ ఇచ్చిన త్రివిక్రం ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఇప్పటికే కథ్ ఏంటో చెప్పిన త్రివిక్రం పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ సిద్దం చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా ఎన్.టి.ఆర్ కెరీర్ లో 30 వ సినిమా కావడం విశేషం. అందుకే త్రివిక్రం బ్లాక్ బస్టర్ ఇవ్వడానికి పక్కాగా స్క్రిప్ట్ ని సిద్దం చేస్తున్నాడు.
అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారన్న ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇప్పటికే పూజా హెగ్డే ఒక హీరోయిన్ గా అనుకుంటున్న త్రివిక్రం మరో హీరోయిన్ గా ఇస్మార్ట్ శంకర్ తో ఫాం లోకి వచ్చిన నభా నటేష్ ని ఎంపిక చేయాలనుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఒక పెద్ద స్టార్ సినిమాలో చేసింది అంటే అది ఒక్క రవితేజ సినిమానే. కాని ఆ సినిమా ఫ్లాప్ గా మిగిలింది.
ఇక ఎన్.టి.ఆర్ త్రివిక్రం సినిమాలో ఈ ఇస్మార్ట్ బ్యూటీ ని ఎంచుకున్నది లేదా అన్నది అధికారకంగా త్వరలోనే వెల్లడికానుంది. అయితే ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ మాత్రం నభా నటేష్ మీద ఆసక్తిగానే ఉన్నారట. ఇక ఈ సినిమాలో ఛాన్స్ దక్కితేమాత్రం టాప్ పొజిషన్ కి నభా రావడం గ్యారెంటీ. ఈ సినిమాని హారిక అండ్ హాసిని ఎంటర్టైన్మెంట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పై రాధాకృష్ణ (చిన్నబాబు) – కళ్యాణ్ రామ్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!