NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: కేబినెట్ లో ఆ అభ్యర్ధికి బెర్త్ కన్ఫర్మ్ చేసిన సీఎం జగన్

YS Jagan: ఉమ్మడి చిత్తూరు జిల్లా పూతలపట్టులో మేమంతా సిద్దం బహిరంగ సభలో అశేషంగా విచ్చేసిన పార్టీ శ్రేణులు, అభిమానులను ఉద్దేశించి వైసీపీ అధినేత, సీఎం జగన్ ప్రసంగిస్తూ.. ఇక్కడ జన మహాసముద్రం కనిపిస్తొందని హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు జరిగిన మేలును వివరిస్తూ.. ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇదే సందర్భంగా కీలక హమీలు ఇచ్చారు.

చిత్తూరు జిల్లా వైసీపీ అభ్యర్ధులను పరిచయం చేస్తూ వారిని దీవించాలని కోరారు. చిత్తూరు ఎంపీ అభ్యర్ధిగా రెడ్డప్ప, పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్ధిగా సునీల్ కుమార్, పలమనేరు ఎమ్మెల్యే అభ్యర్ధిగా వెంకటయ్య గౌడు, చంద్రగిరి నుండి మోహిత్ రెడ్డి, జేడీ నెల్లూరు నుండి కృపాలక్ష్మీ పోటీ చేస్తున్నారనీ, మీ చల్లని దీవెనలు ఉంచాలని కోరారు. చిత్తూరు నుండి విజయానందరెడ్డి, నగరి నుండి రోజా, కుప్పం నుండి భరత్ లను గెలిపించాలని కోరారు.

కుప్పంలో భరత్ ను గెలిపించాలని, ఈ సారి కేబినెట్ లో భరత్ ను కూర్చోబెట్టి మీకు మంచి జరిగిస్తానని జగన్ హామీ ఇచ్చారు. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై భరత్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబును ఓడిస్తే భరత్ కు తన కేబినెట్ లో బెర్త్ కన్ఫర్మ్ చేశారు సీఎం జగన్. జగన్ కు, చంద్రబాబుకు జరుగుతున్న యుద్దం కాదు ఈ ఎన్నికలు.. ప్రజలను మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు, ప్రజలకు మధ్య యుద్దం జరుగుతోందని జగన్ అన్నారు. ఈ యుద్దంగా తాను ప్రజల పక్షాన ఉన్నానని అన్నారు. ఒక్కడిపై పోరాటానికి ఇంత మంది వస్తున్నారనీ, ఇన్ని జెండాలు, ఇన్ని పార్టీలు ఏకమవుతున్నాయని, కుట్రలు, కుంతంత్రాలు చేస్తున్నాయని విమర్శించారు. ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీ, హోదాలను అడ్డుకున్న మరో పార్టీ అంతా చంద్రబాబు పక్షమే అంటూ పరోక్షంగా కాంగ్రెస్, బీజేపీలను ఉద్దేశించి అన్నారు.

ప్రతి నెలా ఒకటో తేదీన సూర్యుడు ఉదయించకముదే వాలంటీర్లు వచ్చి పెన్షన్ లు అందించే వారని అన్నారు. ఈ నెలలో పెన్షన్ల పంపిణీని అడ్డుకోవడంతో అవ్వాతాతలు పడుతున్న అగచాట్లు చూస్తుంటే చంద్రబాబు మనిషా, శాడిస్టా అని అనిపిస్తొందని అన్నారు. ఇలాంటి వ్యక్తికి ఓటు వేయడం ధర్మమేనా అని ప్రశ్నించారు.

పథకం ప్రకారం ఈసీకి తన మని, నిమ్మగడ్డతో లేఖ రాయించి వాలంటీర్ల వ్యవస్థను అడ్డుకున్నారని విమర్శించారు జగన్. జగన్ వస్తేనే మళ్లీ వాలంటీర్లు వస్తారు.. ప్రతి పథకం మీ  ఇంటికే వస్తుంది అన్నారు. చంద్రబాబు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మన రక్తం తాగకుండా జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చిందని జగన్ అన్నారు.

Phone Tapping Case: టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు ఏడు రోజుల పోలీసుల కస్టడీ

 

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N