NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: మధ్యతరగతి వర్గాలకు గుడ్ న్యూస్ ..ఏపిలో మరో బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్ ..

CM YS Jagan: ఏపిలో మధ్యతరగతి వర్గాలకు సీఎం జగన్ గుడ్ న్యూస్ అందించారు. ఇప్పటికే పేద వర్గాలకు సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు, ఇళ్లు మంజూరు చేసిన జగన్ సర్కార్..ఇప్పుడు మద్య తరగతి వర్గాల కోసం తక్కువ ధరలకే ప్లాట్ అందించేందుకు గానూ జగనన్న టౌన్ స్మార్ట్ టౌన్ షిప్ లు (ఎంఐజీ)లకు తీసుకువచ్చింది. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్‌లకు సంబంధించి లే అవుట్లు, వెబ్ సైట్ ను మంగళవారం సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు.

CM YS Jagan launches jagananna township
CM YS Jagan launches jagananna township

 

Read More: Renu Desai: రేణుదేశాయ్, అకీరాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ..

CM YS Jagan: తొలుత అయిదు జిల్లాల్లో

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రంలో 30లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామన్నారు. ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలన్నది ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఇప్పటికే పేదల ఇళ్ల నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. మధ్యతరగతి వర్గాల సొంతింటి కల కూడా ఇక నెరవేరనుందని జగన్ చెప్పారు. మద్యతరగతి వర్గాలు ఈ టౌన్ షిప్ లలో 150, 200, 240 చదరపు గజాల ప్లాట్లు ఎంచుకునే అకాశం ఉందని అన్నారు. తొలి దశలో గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని నవులూరు, అనంతపురం జిల్లా ధర్మవరం, ప్రకాశం జిల్లా కందుకూరు, కడప జిల్లా రాయచోటి, నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వద్ద లే అవుట్లు సిద్ధం చేయడం జరిగిందన్నారు.

18లక్షల వార్షిక ఆదాయం లోపు వాళ్లకే

అన్ని అనుమతులు, వసతులతో డిమాండ్ కు అనుగుణంగా ప్లాట్లు సిద్ధం చేశారు. వార్షిక ఆదాయం రూ.18లక్షల కంటే తక్కువ ఉన్న వారికి మాత్రమే ఇళ్ల స్థలాల కేటాయింపు జరుగుతుందని సీఎం జగన్ తెలిపారు. వెబ్ సైట్ ద్వారా నేటి నుండి ధరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుందని చెప్పారు. అత్యంత పారదర్శకంగా ప్లాట్ల కేటాయింపు జరుగుతుందని సీఎం పేర్కొన్నారు. ఫ్లాట్ ధరను నాలుగు వాయిదాల్లో చెల్లించే అవకాశం ఉందని తెలిపారు. లే అవుట్లలో 60 అడుగుల బీటీ రోడ్డు, 40 అడుగుల సీసీ రోడ్డు, మౌళిక సదుపాయాలు ఉంటాయన్నారు. రెండవ విడతలో ప్రతి నియోజకవర్గంలో జగనన్న టౌన్ షిపిలు ఏర్పాటు సిద్దం కానున్నాయని సీఎం జగన్ వెల్లడించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Breaking: భారీ ఎన్‌కౌంటర్ .. నలుగురు మావో అగ్రనేతల హతం

sharma somaraju

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju

MLC Kavitha: కవితను అందుకే అరెస్టు చేశాం .. అధికారికంగా ఈడీ ప్రకటన

sharma somaraju

Manisha Koirala: పెళ్లైన మూడేళ్ల‌కే విడాకులు.. భ‌ర్త నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెడుతూ తొలిసారి నోరు విప్పిన మనీషా కోయిరాలా!

kavya N

Amritha Aiyer: హ‌నుమాన్ వంటి బిగ్ హిట్ ప‌డినా క‌లిసిరాని అదృష్టం.. అమృత ద‌శ తిరిగేదెప్పుడు..?

kavya N

Prabhas: పాన్ ఇండియా స్టార్ కాక‌ముందే బాలీవుడ్ లో ప్ర‌భాస్ న‌టించిన సినిమా ఏదో తెలుసా?

kavya N

మ‌హాసేన రాజేష్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా స్కెచ్ వేసిన చంద్ర‌బాబు – ప‌వ‌న్‌…!

పైకి పొత్తులు – లోపల కత్తులు.. బీజేపీ గేమ్‌తో చంద్ర‌బాబు విల‌విలా…!

మ‌రో మ‌హిళా డాక్ట‌ర్‌కు ఎమ్మెల్యే సీటు ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు…?

Hanuman: హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ కి కీరవాణి ఆవహించాడా? ఓటీటీ లో చూస్తూ పాటలు వింటుంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ పాటలు విన్నట్టే ఉంటుంది!

kavya N

BRS: దానంపై అనర్హత వేటు వేయండి ..స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు

sharma somaraju

సికింద్రాబాద్‌లో ఈ సారి కిష‌న్‌రెడ్డి గెల‌వ‌డా… ఈ లాజిక్ నిజ‌మే…!

ష‌ర్మిల పోటీ ఎక్క‌డో తెలిసిపోయింది.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిందిగా…!