యువ హీరో నితిన్ ప్రస్తుతం నటిస్తోన్న సినిమా రంగ్ దే. భీష్మ ద్వారా సూపర్ హిట్ సాధించిన నితిన్, కీర్తి సురేష్ హీరోయిన్ గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. లాక్ డౌన్ కు ముందు మెజారిటీ షూటింగ్ ను పూర్తి చేసుకుంది.
రంగ్ దే టీమ్ నుండి ఈరోజు నితిన్ పెళ్లి సందర్భంగా టీజర్ విడుదలైంది. ఈరోజు నితిన్, షాలినిని పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెల్సిందే. ఆ సందర్భంగా రంగ్ దేకు సంబంధించి చిన్న టీజర్ ను విడుదల చేసారు. నితిన్ కు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతూ విడుదల చేసిన టీజర్ ఫన్నీగా ఉంది. రంగ్ దేను సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోన్న విషయం తెల్సిందే.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!