Dhee: ఢీ 14లో కనిపించని సుధీర్, రష్మీ! కారణం అదేనా?

Share

Sudheer and Rashmi: సుధీర్, రష్మీ జోడి బుల్లితెర పైన ఓ సెన్షేషన్. అంతలా జనాల్లోకి వారు దూసుకు పోయారు. దానికి కారణం ఏకైక షో.. దాని పేరే జబర్ దస్త్. ఈ షో ద్వారా వీరు ఎంతలా ఫేమస్ అయ్యారంటే, ప్రేక్షకులు వాళ్ళని పెళ్లి చేసుకునేంత. అంతలా వాళ్ళు ఆ షో ద్వారా ఆడియన్స్ మనసులను కొల్లగొట్టారు. ఇక దానితో పాటుగా డాన్స్ షో అయినటువంటి ఢీ లో కూడా వీరిద్ద‌రూ క‌లిసి ఆడియెన్స్‌ను అలరించిన సంగ‌తి మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఢీ నుంచి సుధీర్‌, ర‌ష్మీ గౌత‌మ్ బ‌య‌ట‌కు వ‌చ్చేశారంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి.

కారణం ఏమై ఉంటుంది?

రీసెంట్‌గానే ఢీ-13 షో సక్సెస్ ఫుల్ గా ముగిసింది. ఇప్పుడు తరువాత మొదలవ్వబోయే ఢీ-14 డాన్స్ షో మీదే అందరి కళ్ళు పడ్డాయి. ఈ క్రమంలో తాజాగా ఢీ-14 ప్రోమోను నిర్వాహ‌కులు విడుద‌ల చేశారు. ఇందులో టీమ్ లీడ‌ర్స్‌ గా సుధీర్‌, ర‌ష్మీ గౌత‌మ్ స్థానంలో బిగ్ బాస్ సీజ‌న్-4 కంటెస్టెంట్ అయినటువంటి అఖిల్‌ మెరిశారు. దాంతో అందరికీ రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. తరువాత ర‌ష్మీ ప్లేసులో రష్మీనే వుంటుందా లేక వేరొకరు రాబోతున్నారా? అనే అనుమానం ప్రేక్షకుల మదిలో మెదిలింది.

అసలు కారణం ఇదేనంట!

రెమ్యున‌రేష‌న్(డబ్బులు) విష‌యంలో వీరు రాజీ పడలేదని, చ‌ర్చ‌లు జరిగిన త‌ర్వాత కూడా వీరు మాట వినలేదని, అందువలన నిర్వాహ‌కులు వారు అడిగినంత డబ్బులు ఇవ్వ‌లేక ప‌క్క‌న పెట్టేశారనేది కొందరి వాదన. ఓ పక్క సుధీర్ రష్మీ జంట లేని ఢీ-14 సీజన్‌ ను చూడ‌లేమ‌ని త‌న అభిమానులు నెట్టింట ర‌చ్చ రంబోలా చేయడం మనం గమనించవచ్చు. ఇక ఆడియన్స్ కోరిక మేరకు నిర్వాహకులు తమ మనసు మార్చుకుంటారా లేక రష్మీ సుధీర్ల జంట పెద్ద మనసు చేసుకొని షోలో పాల్గొంటారా లేదనేది కాలమే నిర్ణయించాలి.


Share

Recent Posts

రాజకీయ రంగంలోకి సౌత్ ఇండియాలో మరో టాప్ హీరోయిన్..??

దక్షిణాది సినిమా రంగంలో తుని దారులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా తమిళ సినిమా రంగంలో అయితే హీరో లేదా హీరోయిన్ నచ్చాడు అంటే విగ్రహాలు కట్టేస్తారు...…

37 నిమిషాలు ago

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

2 గంటలు ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

2 గంటలు ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

4 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

5 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

5 గంటలు ago