న్యూస్

idols : మీ పూజ లో పాడైపోయిన  దేవుడి ప్రతిమలను ఇలా  మాత్రం చేయకండి ??

Share

idols : రోడ్డుప్రక్కన  ఉన్న చెట్టు
ప్రతి ఒక్కరి ఇంట్లో పాడైపోయిన లేదా  విరిగిపోయిన  జీర్ణమైన విగ్రహాలు , చిత్ర పటాలు  ఎవొకటి ఉంటూనే ఉంటాయి.
ఈ సమస్య   అనేది అందరికీ  ఉంటుంది. అయితే కొందరు  తమ ఇంట్లో పాడైపోయిన విగ్రహాలు, పటాలు   ఏ దేవాలయంలో లేదా రోడ్డుప్రక్కన  ఉన్న చెట్టు క్రిందో  పెట్టేస్తుంటారు. కానీ తెలిసి తెలియక అలా చేయడం అనేది తప్పు పని.  క్షమించరాని నేరం గా చెప్పబడింది.

idols : ఎంతమాత్రం తప్పు కాదు

ఇంట్లో వున్నంతకాలం పూజలు చేసి  పాడైపోయాయి అని  వాటిని ఎక్కడో వదిలేయకండి.  అలా రోడ్డు పక్కన ఉన్న మన  దేవుళ్ళ ఫోటోలు చూసి ఇతర మతస్తులు మన మతం గురించి   అవహేళన చేస్తున్నారు. వారికీ  అలాంటి అవకాశం ఇవ్వకండి.  ఎందుకంటే ఇతర మతస్థుల దేవుళ్ళ ఫోటోలు అంత దయనీయంగా మనం  ఎక్కడా చూడము.  కాబట్టి  దయచేసి   అవసరం లేని  పటాలను లేదా దేవుడి బొమ్మలను అగ్ని లో ఆహుతి  చేయడం అనేది  మంచి పద్దతి. అదేంటి  అలా చేయడం తప్పుకదా  అన్న సందేహం మీకు కలగవచ్చు.  కానీ అగ్ని సర్వభక్షకుడు, అన్ని వేళలా పునీతుడుగా ఉండువాడు. కాబట్టి  పవిత్రాగ్నిలో దేవతా పటాలను  వేయడం  ఎంతమాత్రం తప్పు కాదు అని తెలుసుకోండి.  లేదంటే  ప్రవహిస్తున్న నదిలో గాని మన ఊరి చెరువుల్లో గాని నిమజ్జనం చేయండి.

 సుఖ శాంతులతో

ఇక్కడ గుర్తు పెట్టుకోవాలిసింది  ఏమిటంటే అగ్నిలో వేయాలనుకున్న, నదిలో వదలానుకున్నా ముందుగా ఆ విగ్రహానికి నమస్కరించి   గచ్చ గచ్చ సుర శ్రేష్ఠ స్వస్థాన పరమేశ్వర  చెప్పుకుని   వదిలేయండి. ఇది కూడా నిమజ్జనం అని  గుర్తు పెట్టుకోండి. దీనిని గురించి  అందరికి తెలియచేయండి. ఇది మన కర్తవ్యం అని  భావించండి.  ధర్మ ఆచరణ చేయండి .. సుఖ శాంతులతో ఉండండి. అంతే తప్ప ఎక్కడ పడితే అక్కడ అలా వదిలేసి వెళ్లిపోకండి. ఈ  విధం గా చేయండి.


Share

Related posts

ఏమాత్రం భయం లేకుండా.. తన బాడీ పార్ట్స్ గురించి ఇలియానా ఇలా చెప్పిందేంటి?

Varun G

Man Chews Snake: అతను పామును నమిలి మింగేశాడు..! ఎందుకో తెలిసి అందరూ షాక్ అయ్యారు..!!

somaraju sharma

Black Radish: నల్ల ముల్లంగి తో ఈ ఆరోగ్య సమస్యలు దూరం..!!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar