న్యూస్

Radhasaptami : రథ సప్తమి రోజున కొత్తబియ్యం తో పాటు కొత్త బెల్లం కలిపి ఇలా చేయండి!!

Share

Radhasaptami  తొలిసారిగా ఈ రథాన్ని అధిరోహించి
మన పురాణాలను,ఇతిహాసాలను పరిశీలిస్తే సూర్యారాధన   చేయడానికి  గల ప్రాధాన్యత అర్థమవుతుంది.   ప్రత్యక్ష దైవం అయిన సూర్యభగవానుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే రోజు ‘రథసప్తమి’.లోకాన్ని కమ్ముకుని ఉన్న  చీకట్లను పారద్రోలి వెలుగును ఇవ్వడం కోసం    సూర్య భగవానుడు  వేయి కిరణాలను ప్రసరింపజేస్తూ వుంటాడు. ఈ వేయి కిరణాలలో ఒక ఏడు కిరణాలు అత్యంత విశిష్టమైనవిగా  చెబుతారు.  ఈ గుర్తు గానే సూర్యుడు ఏడు గుర్రాలు  కలిగి  ఉన్న  రథంపై  పైనమిస్తాడు అని అంటారు.   అలా సూర్యు భగవానుడు  తొలిసారిగా ఈ రథాన్ని అధిరోహించి తన బాధ్యతలను చేపట్టిన రోజే రథసప్తమి అని అంటారు. ఈ విషయాన్ని లోకమంతటికి తెలియజేయడం కోసమే ఈ రోజున బ్రాహ్మీ ముహూర్తంలో ఆకాశంలోని నక్షత్రాలు రథం ఆకారం లో  కనిపిస్తుంటాయని ఆధ్యాత్మిక గ్రంధాలు  తెలియచేస్తున్నాయి.

Radhasaptami సూర్య భగవానుడు  తన ధర్మాన్ని

బ్రహ్మ తన  సృష్టిని ఎప్పుడు  మొదలు  పెట్టిన తూర్పు దిక్కునే ముందుగా సృష్టిస్తాడట.   సూర్యుడు ఏడు గుర్రాల మీద రథమెక్కి కర్మ సాక్షిగా బాధ్యతలు స్వీకరించాడట.. సూర్యునికి సంబంధించినంతవరకు ఏడవ సంఖ్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.. సూర్యుని రథంలో ఉన్న గుర్రాలా  సంఖ్య ఏడు ,మనకున్న వారంలో రోజులు  కూడా ఏడు ,ఏడు  రంగుల ఇంద్రధనస్సు , కాబటిట్  తిథులలో ఏడవది అయిన సప్తమి రోజు  అనగా  మాఘ శుద్ధ సప్తమి నాడు సూర్యుడు ఏడు  గుర్రాలతో తన గమనాన్ని  ప్రారంభిస్తాడు. దీనికి సంకేతం గా  రథ సప్తమి నాడు రాత్రి నక్షత్రాలు  అన్ని  రథ ఆకారాన్ని పోలిఉండడం అనేది జరుగుతుంది.
సూర్య భగవానుడు  తన ధర్మాన్ని నిర్వర్తించడం కోసం బయలుదేరాడనటానికి సూచనగా ,ఆయనకి ఆహ్వానం పలుకుతూ ప్రతి వాకిట్లోను ఈ రోజున రథం ముగ్గులు వేస్తుంటారు.అలాగే  సూర్యభగవానుడికి “అర్కుడు”అనే పేరు కూడా కలదు. అందువల్లనే ఆయనకి అర్కపత్రం అంటే జిల్లేడు ఆకు ప్రీతికరమైనది అని  అంటారు.

కృతజ్ఞతలు తెలియజేయడం

ఈ కారణం తోనే రథసప్తమి రోజున తలపై ఏడు జిల్లేడు ఆకులు పెట్టుకుని తలస్నానం  చేస్తుంటారు. కొత్త బట్టలు వేసుకుని  భక్తిశ్రద్ధలతో సూర్యభగవానుడిని పూజిస్తారు. కొత్త బియ్యం  తో పాటు కొత్త బెల్లాన్ని కలిపి తయారు  పాయసాన్ని తయారు చేసి  నైవేద్యంగా పెడతారు. ప్రకృతి ద్వారా తమకి కావలసిన ఆహార పదార్థాలను ఇస్తున్న సూర్యనారాయణమూర్తికి ఈ విధం గా  కృతజ్ఞతలు తెలియజేయడం  అని చెప్పుకోవచ్చు.


Share

Related posts

తమిళ సూపర్ స్టార్ కు హైదరాబాద్ లో రోడ్ సైడ్ ఇడ్లీ తెగ నచ్చేసింది… బండి ఓనర్ లైఫ్ టర్న్ అయింది..!

arun kanna

Red Ladyfingers: ఎర్ర బెండకాయలలో పోషకాలు డబల్..!! తినకపోతే మీకే నష్టం..!!

bharani jella

Bigg Boss 5 Telugu: ఆమెకే నా ఫుల్ సపోర్ట్ అంటున్నా.. హరితేజ..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar