Lemon Lamp: మంగళ ,శుక్ర వారాలలో నిమ్మకాయ  దీపం ఎవరు పెట్టాలో తెలుసా ? అలా పెట్టడం వలన జరిగేది ఇదే!

Share

Lemon Lamp: కుజ దోషం,కాలసర్ప దోషం, వ్యాపార, కుటుంబ, ఆర్ధిక సమస్యలతో   సతమతం అయ్యే వారికి  మంచి పరిష్కారం నిమ్మకాయ దీపం.

Lemon Lamp:  శక్తి స్వరూపిణి పార్వతి దేవికి   నిమ్మకాయలు చాలా ఇష్టమైనవి.

నిమ్మకాయల తో తయారు  చేసిన దండను పార్వతి దేవి తో పాటు   గ్రామ దేవతలైన పోచమ్మ ,మైసమ్మ , పెద్దమ్మ, ఎల్లమ్మ ,  మారెమ్మ,మొదలైన శక్తి రూపంలో అమ్మవారికి  మాత్రమే వేస్తారు.నిమ్మకాయల దీపం కూడా గ్రామ దేవతల దేవాలయాల్లో  మాత్రమే  వెలిగించాలి.  మహాలక్ష్మి , సరస్వతి మరియు ఇతర దేవాలయాల్లో  నిమ్మకాయ దీపాలు  అసలు పెట్టకూడదు.
ఒక వేళ అలా వెలిగిస్తే ఆ ఇంట సంతోషం అనేది ఉండదు .సంసారం లో ఎప్పుడు గొడవలు జరుగుతూ  ఉంటాయి.  ఆర్థిక  పరమైన చిక్కులు వస్తాయి.  కుటుంబ సభ్యులు స్నేహితులు,బంధువులు మధ్య తగాదాలు  ఎప్పుడు ఏదో ఒక గొడవ జరుగుతూ ఉంటుంది .
పార్వతి అమ్మవారి దేవాలయాల్లో మంగళవారం,శుక్రవారం రాహుకాల సమయంలో మాత్రమే ఈ దీపాన్ని  వెలిగించాలి.

ప్రతి మంగళవారం రాహుకాలం ఉండే సమయం మధ్యాహ్నం3 గంటల నుంచి 4:30 గంటల వరకు ఉంటుంది.అదే శుక్రవారం అయితే  ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది.మంగళవారం నాడు  పెట్టే  దీపాల కన్నా..  శుక్రవారం వెలిగించే దీపాలు  చాలా శక్తి వంతమైనవిగా  చెబుతారు .  శుక్రవారం    వెలిగించే ఈ దీపం వలన మనస్సుకు ప్రశాంతత దొరుకుతుంది .
శుక్రవారం రోజు అమ్మవారి దగ్గర   నిమ్మకాయ దీపాన్ని  పెట్టి  పెరుగు అన్నం,  పెసరపప్పు , పానకం   మజ్జిగ , పండ్లు వీటిలో ఏదైనా ఒకటి అమ్మవారికి  నైవేద్యంగా పెట్టి  తరువాత సుమంగళి ఇవ్వాలి.మీకు కుదిరితే పూలు, గాజులు,పసుపు , కుంకుమ , జాకెట్ ముక్క ,చీరలు ఇస్తే అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణం గా పొందగలుగుతారు .తాంబూలం  ఇవ్వడం తో పాటు మీ  శక్తికి తగినట్టుగా దక్షిణ కూడా ఇచ్చి సుమంగళి కి  నమస్కారం  చేసుకోవాలి. ఇలా చేస్తే  అనుకున్న పనులు అనుకున్నట్టు ఎటువంటి ఆటకం లేకుండా శుభప్రదంగా  జరుగుతాయి.


Share

Related posts

Corona: షాక్ః మ‌ళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు… మ‌న సంగ‌తి ఏందంటే…

sridhar

కుక్క‌కు పులిలా క‌నిపించేలా పెయింట్ వేసిన ప్ర‌బుద్ధులు..!

Srikanth A

Pawan kalyan: పవన్ కళ్యాణ్ భక్తుడు బండ్ల గణేష్ హీరోగా.. మూవీ..??

sekhar