NewsOrbit
న్యూస్

Easwar Mahadev Temple: ఆ ఆలయంలో ప్రతి రోజు తెల్లవారుజాము నాలుగు గంటలకు జరిగే అధ్బుతం ఎప్పటికీ మిస్టరీనే..! అది ఏమిటంటే..?

Easwar Mahadev Temple: మనదేశంలోని కొన్ని ఆలయాల్లో ఇప్పటికీ జరుగుతున్న కొన్ని అద్భుతాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. వాటి వెనుక భగవంతుడి లీల అని భక్తులు విశ్వసిస్తుంటారు. అలాంటి అధ్బుత ఆలయం ఒకటి మధ్యప్రదేశ్ రాష్ట్రం మోరేనా జిల్లాలో ఉంది. పకృతి అందాల నడుమ దట్టమైన అరణ్య ప్రాంతంలో ఎత్తైన కొండపై ఉన్న ఈశ్వర మహాదేవ్ ఆలయంలో నిత్యం ఒక అద్భుతం సాక్షాత్కరిస్తుంది. అది ఏమిటంటే ప్రతి రోజు ఆలయ పూజారి వేకువ జామున ఆలయ గర్భగుడి తలుపులు తీసే సమయానికి ఎవరో స్వామివారిని పుష్పాలు, బిల్వదళాలతో పూజించి వెళ్లిపోయినట్లు కనబడుతుంటుంది.

Easwar Mahadev Temple Madhya Pradesh
Easwar Mahadev Temple Madhya Pradesh

లింగ స్వరూపుడైన స్వామివారిని భ్రహ్మముహూర్తంగా అభిషేకించిన ఆనవాళ్లు ప్రతి రోజు ఆలయ పూజారి గమనిస్తుంటారు. అయితే ఆలయానికి ఎవరు వచ్చి స్వామివారికి పూజిస్తున్నారు అనేది ఎవరికీ అంతుబట్టదు. వేసిన తలుపులు వేసినట్లే ఉంటాయి. పూజ చేసి వెళ్లినట్లు స్పష్టమైన ఆధారం కనబడుతుంటుంది. వేకువ జాము 4 గంటలకే ఓ సిద్ధ యోగి ఇక్కడకు వచ్చిన స్వామివారికి పూజిస్తుంటారని అక్కడి వారు చెబుతుంటారు. అయితే వచ్చేది ఎవరు, ఎటు నుండి వచ్చి వెళుతారు అనేది ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు.

ఈ ఆలయంలో మరో విశేషం ఏమిటంటే ఏడాది పొడవునా 365 రోజులు సహజ సిద్ధంగా శివలింగంపైన నీరు పడుతూనే ఉంటుంది. రాజుల కాలం నుండి కూడా ఎందరో ఆలయానికి ఎవరు వచ్చి పూజలు చేస్తున్నారు అనేది తెలుసుకునేందుకు ప్రయత్నించినా విఫలమైనట్లు చెబుతుంటారు. అయితే ఈ విశేషానికి సంబంధించి రెండు మూడు విధాలుగా ప్రచారంలో ఉంది. ఈ శివలింగాన్ని రావణుడి తమ్ముడైన విభీషణుడు ప్రతిష్టించారనీ, పురాణాల ప్రకారం సప్త చిరంజీవుల్లో విభీషణుడు కూడా ఒకరని, శివలింగాన్ని ఆయనే ప్రతిష్టించారు కనుక నేటికీ ఆయనే వచ్చి శివుడి పూజార్చన చేస్తున్నారని అక్కడి స్థానికుల నమ్మకం. మరో కథనం ఏమిటంటే రాందాస్ జీ మహారాజ్ అనే సన్యాసి గతంలో ఇక్కడ తపస్సు చేశారనీ, అయితే ఆయన శరీరాన్ని వదిలిపెట్టినప్పటికీ అదృశ్య రూపంలో క్రమంతప్పకుండా ఇక్కడ పూజలు చేస్తుంటారని చెబుతుంటారు.

author avatar
bharani jella

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju