NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BRS MLC Kavitha: ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ ఝలక్

BRS MLC Kavitha:  ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇంతకు విచారణను ఎదుర్కొన్న సమయంలోనే నోటీసులు ఈడీ జారీ చేయగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికలకు ముందు ఇడీ, ఐటీ అధికారులు రాష్ట్రానికి వస్తారని, ఆ తర్వాత మోడీ వస్తారంటూ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కవిత ఇంటిపై ఈడీ, ఐటీ సోదాలు చేపట్టడం తీవ్ర సంచలనం అయ్యింది.

MLC Kavitha

ఢిల్లీ నుండి హైదరాబాద్ కు వచ్చిన పది మంది అధికారుల బృందం కవిత నివాసానికి చేరుకుని సోదాలు చేస్తొంది. ఐటీ, ఈడీ అధికారులతో కలిసి జాయింట్ గా .. మొత్తం నాలుగు టీమ్ లు ఏర్పడి తనిఖీలు చేస్తున్నారు. తనిఖీల నేపథ్యంలో కవిత నివాసం ముందు భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున కవిత ఇంటికి చేరుకున్నారు.  లోక్ సభ ఎన్నికలకు ముందు ఈ సోదాలు జరుగుతుండటం బీఆర్ఎస్ లో ఆందోళన రేకెత్తిస్తొంది. లిక్కర్ స్కామ్ కేసులో పలు మార్లు విచారణకు హజరు కావాలని నోటీసులు జారీ చేసినా ఇటీవల కాలంలో హజరు కావడం లేదు.

గత పదేళ్ల ఆర్ధిక లావాదేవీలపై ఈడీ వివరాలు సేకరిస్తుంది. కవిత, ఆమె సహాయకుల సెల్ ఫోన్ లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపై ఈడీ ఆరా తీస్తొంది. కాగా, ఈడీ విచారణపై కవిత సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ పై ఈ నెల 19న విచారణ జరగనుంది. తనపై చర్యలు తీసుకోకుండా ఈడీకి ఆదేశాలు ఇవ్వాలని కవిత పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ పై విచారణ పెండింగ్ లో ఉండగానే కేంద్ర దర్యాప్తు సంస్థలు జాయింట్ గా సోదాలు చేపట్టడం విశేషం.

YSRCP: వైసీపీ కండువా కప్పుకున్న ముద్రగడ

Related posts

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N