Ammayi garu: సుష్మిత.. ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. నటించింది కొన్ని సీరియల్స్ అయినప్పటికీ ఎనలేని ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. అంతేకాకుండా సీరియల్స్ లో పలు ముఖ్య పాత్రలలో పోషించడమే కాకుండా కొన్ని షోస్ కి యాంకరింగ్ మరియు గెస్ట్ గా హాజరవుతూ సందడి చేస్తుంది. గతంలో స్టార్ మా లో ప్రసారమైన రాఖీ పౌర్ణమి సీరియల్లో ఈమె నటనకి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారనే చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో స్టార్ మా లో అనేక సీరియల్స్ ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.
మంచి ప్రాధాన్యత ఉన్న కంటెంట్లను ప్రేక్షకులకి అందిస్తూ తమ ఛానల్ ని టాప్ వన్ ప్లేస్ లో ఉంచుతున్నారు స్టార్ మా అధికారులు. ఇక అలా ప్రేక్షక ఆదరణ పొందిన సీరియల్స్ లో రాఖీ పౌర్ణమి సీరియల్ కూడా ఒకటి. ప్రస్తుతానికి ఈ సీరియల్ ఎండ్ అయిపోయింది. కానీ ఈ సీరియల్ లో నటించిన యాక్ట్రెస్ ని మాత్రం ఇంకా ప్రేక్షకులు మర్చిపోలేదు. అన్నా చెల్లెలు మధ్య రూపొందిన ఈ సీరియల్ కథాంశం ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. ఇక ఢీ14లో టీం లీడర్ గా వ్యవహరించిన సుష్మిత ఈ సీరియల్ లో ఓ ప్రధాన పాత్రలో నటించింది. ఈ ముద్దుగుమ్మ కాకినాడ లో జన్మించింది. పుట్టి పెరిగింది కాకినాడ కనుక అప్పుడప్పుడు ఈమెకి ఆ స్లాంగ్ కూడా వస్తూ ఉంటుంది.
ఇక ఈమెకి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉండడంతో అనంతరం మోడలింగ్ రంగంలో కొనసాగి ఆ తర్వాత సీరియల్స్ లో అడుగు పెట్టింది. స్టార్ మా లో ప్రసారమైన నీవల్లే నీ వల్లే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక ఈ ముద్దుగుమ్మ ఒక్క సీరియల్స్ లోనే కాకుండా పలు షోస్ లో కూడా పాల్గొని తన వంతు ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. ఇక గతంలో ఈటీవీలో ప్రసారమైన బిగ్గెస్ట్ షో ఢీ లో కూడా పాల్గొని సందడి చేసింది. ఇక ఈ షో తోనే భారీ పాపులారిటీ సంపాదించుకుంది సుష్మిత. ఇక శర్వానంద్ హీరోగా నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీలో ప్రధాన పాత్ర పోషించి మరోసారి తన యాక్టింగ్ నిరూపించుకుంది.
అలా ఒక బుల్లితెర సీరియల్స్ కే పరిమితం కాకుండా వెండితెరపై కూడా పలు సినిమాస్లో నటించి మంచి ప్రేక్షకు ఆదరణ పొందింది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అమ్మాయిగారు అనే సీరియల్ లో ఓ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ సీరియల్తో మరింత గుర్తింపును పొందింది కూడా. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సుష్మిత ఓ యాక్టర్ ని లవ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఆ యాక్టర్ మరెవ్వరో కాదు.. విరూపాక్ష మూవీలో ప్రధాన పాత్రలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న రవి కృష్ణనే. గతంలో వీరిద్దరూ కలిసి ఢీ షోలో పాల్గొని సందడి చేశారు. ఇక ఈ తరుణంలోనే వీరిద్దరూ ప్రేమలో పడినట్లు తెలుస్తుంది. అలా ప్రస్తుతానికి అయితే గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణాన్ని నడుపుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!