NewsOrbit
న్యూస్

YCP: ఎన్నికల్లో గెలిచినా ఇది వైసీపీకి బ్యాడ్ న్యూస్ యే..

YS Jagan: Planning Blasting Changes in Party, Government

YCP: రీసెంట్ గా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ అధికార వైసీపీ ( ycp ) విజయ దుందుభి మోగించిన సంగతి తెలిసిందే. ఈ విజయాలు ఆ పార్టీకి ఉత్సాహన్ని నింపుతున్నప్పటికీ ఓ బ్యాడ్ న్యూస్ కూడా పొంది ఉంచి. జగన్ సర్కార్ తీసుకువచ్చిన మూడు రాజధానుల ప్రభావం కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలోని వైసీపీపై పడింది. అధికార పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లోనూ టీడీపీ పుంజుకుని గట్టి ఫైట్ ఇచ్చింది. రాజధాని అమరావతి అంశం ఈ జిల్లాల్లో పని చేసినట్లే కనబడుతోంది. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని అమరావతికి (  Amaravathi ) కట్టుబడి ఉన్నానని పదేపదే చెబుతున్నారు. మూడు రాజధానుల ప్రకటన నేపథ్యంలో కృష్ణ గుంటూరు ప్రకాశం తదితర జిల్లాల్లో భూముల ధరలు గణనీయంగా తగ్గిపోయాయి. దీని ప్రభావం మున్సిపల్ ఎన్నికల్లో స్పష్టంగా కనబడినట్లే చెప్పుకోవాలి.

YCP: కృష్ణాజిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో

 

కృష్ణాజిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో వైసీపీతో సమానంగా టీడీపీ వార్డులను గెలుచుకున్నది. అధికార వైసీపీ 14 వార్డులను గెలుచుకోగా, టీడీపీ కూడా 14 వార్డలను గెలుచుకున్నది. ఇండిపెండెంట్ అభ్యర్ధిని ఒకరు గెలవగా ఆమె టీడీపీలో చేరారు. ఇక్కడ టీడీపీ ఎంపి కేశినేని నాని ఓటు కీలకం కానున్నది. నానికి ఎక్స్ అఫిషియో ఓటు అర్హత ఇస్తే చైర్మన్ టీడీపీ  ( TDP ) పరమవుతుంది. ఒక వేళ కేశినేనికి ఓటు వేస అవకాశం ఇవ్వకపోతే కీలక పరిణామంచోటుచేసుకుంటుంది.  వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తన ఎక్స్ అఫిషియో ఓటుతో వైసీపీ, టీడీపీ బలాబలాలు 15 -15 తో టై అవుతుంది.  దీంతో చైర్మన్ ఎంపికకు డ్రా పద్ధతిని ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన వసంత కృష్ణప్రసాద్ ఎన్నికల ప్రచార సభల్లో అమరావతి నుండి రాజధాని తరలిపోదనీ, ఒక వేళ రాజధాని తరలిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాననీ కూడా సవాల్ చేశారు. ఇదిలా ఉంటే జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ప్రాతినిధ్యం వహిస్తుండగామున్సిపాలిటీలో టీడీపీ గట్టి పోటీనే ఇచ్చింది. చాలా వార్డుల్లో స్వల్పఆధిక్యతలే ఉన్నాయి. మున్సిపాలిటీ వైసీపీ గెలుచుకున్నా టీడీపీ గట్టి ఫైట్యే ఇచ్చింది.

YSRCP: Party Internal Big Issues Causing Loose

అదే విధంగా గుంటూరు కార్పోరేషన్   (Guntur Corporation ) పరిధిలో అధికారంలో ఉన్నా ఓ డివిజన్ ను వైసీపీ కోల్పోయింది. రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా రాజధాని ప్రాంతంలో ఓ డివిజన్ పరాజయం పాలవ్వడం అంటే రాజధాని ఎఫెక్టే అని భావిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న రాజధాని ప్రాంతంలో రెండు ఎంపీటీసీ స్థానాలను వైసీపీ కోల్పోయింది. దాచేపల్లి, గురజాల మున్సిపాలిటీల్లోనూ టీడీపీ పుంజుకుంది. ఇక ప్రకాశం జిల్లా దర్శి మున్సిపాలిటీని ఏకంగా టీడీపీ కైవశం చేసుకోవడం గమనార్హం.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju