Karate Kalyani: ఎంపీ అంటూ సినీ తరాలకు బురిడీ..! మహిళా నేతలను వదల్లేదు..!!

Share

Karate Kalyani: రవితేజ నటించిన సూపర్ హిట్ సినిమా కృష్ణ లో బ్రహ్మానందం తో కలిసి కామెడీ చేసి ప్రేక్షకులను అలరించి,మిరపకాయ్ మూవీలో లో తన నటనతో వారిచేత “అబ్బ” అనిపించుకున్న నటి కరాటే కల్యాణి చాలామందికి తెలిసే ఉంటుంది.ఏదైనా విషయం వచ్చినప్పుడు ఆమె టీవీ చానెళ్ల డిబేట్ల లోకూడా చురుగ్గా పాల్గొంటుంటుంది హాట్హాట్గా మాట్లాడుతుంటుంది.మొత్తంగా చూస్తే ఆమె ఏదో ఒక విధంగా వార్తల్లోనే ఉంటుంది. సోషల్ మీడియాలో మరీ యాక్టివ్గా ఉంటుంది.అలాంటి కరాటే కల్యాణి తాజాగా ఒక పోస్ట్ తో అందరి దృష్టిని ఆకర్షించింది.ఏకంగా ఒక ఎంపీయే తనతో వంకరగా ప్రవర్తించాడంటూ చెప్పుకుంది .

Fake MP Calls to Karate Kalyani
Fake MP Calls to Karate Kalyani

Karate Kalyani: కరాటే కల్యాణి చెప్పిందేమిటంటే?

ఈ నెల 25వ తేదీన ఆమెకు ఒక వ్యక్తి ఫోన్ చేసి తనను తాను ఒరిశా ఎంపీగా పరిచయం చేసుకున్నాడట.మూడుసార్లు ఎంపీగా గెలిచానని చెప్పాడట.కరాటే కల్యాణి సేవా కార్యక్రమాలతో ఇంప్రెస్ అయ్యానని,మీకు ఏమైనా సాయం కావాలంటే చేస్తానని కోట్లయినా పర్వాలేదని ఆఫర్ చేశాడట.కాసేపట్లోనే తనకు పదిసార్లు అతడి నుండి ఫోన్ వచ్చిందని ,మాట్లాడుతున్నది ఒక్కడే గానీ గొంతుమార్చి మాట్లాడాడని కరాటే కల్యాణి తెలిపింది. మీకు బిజెపిలో ఏదో పదవి కూడా ఉందనుకుంటా గా అని తనను అతను అడిగాడని ..తానిప్పుడు ఏ పార్టీలో లేనని చెప్పానని ఆమె తెలిపింది .చివరాఖరుగా మీకు పెళ్లి అయిందా అంటూ ఎంపీనని చెప్పుకున్న వ్యక్తి తనను ప్రశ్నించడంతో విషయం అర్థమై ఫోన్ కట్ చేశానని ఆమె చెప్పింది.

కాగా తన ఫోన్ నంబర్ కోసం సదరు వ్యక్తి డీకే అరుణ ,విజయశాంతి వంటి వారిని కూడా కాంటాక్టు చేసినట్లు చెప్పుకున్నాడని , తనపై ఆయనకెందుకంత స్పెషల్ ఇంట్రెస్ట్ అని కరాటే కళ్యాణి తన ఫేస్బుక్ ద్వారా ప్రశ్నించారు.చివరగా తనతో పెట్టుకుంటే బాజా బరాత్ అంటూ కరాటే కల్యాణి అతడికి వార్నింగ్ కూడా ఇచ్చింది.ఒరే పిచ్చి ఎంపీ ఇంకెవర్నన్నా ట్రై చేస్కో అని కూడా అతడికి సలహా పారేసింది. సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండాల్సిన ఆవశ్యకతను ఇలాంటి సంఘటనలు మనకు చెప్తుంటాయి ఆమె అన్నారు .అయితే ఇంత తెలివి వున్న ఆ కరాటే కల్యాణి ఏ నెంబర్ నుండి ఫోన్ వచ్చిందో పోలీసులకు తెలియజేస్తే వాళ్ళే అన్ని విషయాలు తేలుస్తారు కదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.చూద్దాం ..ఈ వ్యవహారం ఇంకేం మలుపు తిరుగుతుందో?

 


Share

Related posts

ఆ బాలీవుడ్ దర్శకుడు ఎన్టీఆర్ హీరోయిన్ ను రూమ్ కు పిలిచి ఏదేదో చేసాడట… మధ్యలో బుక్కైన తాప్సి

sowmya

నిర్భయధోషి పవన్ కుమార్ గుప్తా పిటీషన్ ని కొట్టేసిన సుప్రీం కోర్ట్

Siva Prasad

ప్రజలేనా.. ఆయన పెట్టుకోరా మాస్క్.. ఏపీలో కామెంట్స్!

Muraliak