Honor Killing: పెరుగుతున్న బలవన్మరణాలు, పరువు హత్యలు..! తాజాగా చిత్తూరు జిల్లాలో మరొకటి..!!

Share

Honor Killing: ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రేమకుల ఆత్మహత్యలు, పరువు హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. గతంలో సూర్యపేట జిల్లా చివ్వెంలలో, నిజామాబాద్ జిల్లా రెండు ప్రేమ జంటలు బలవన్మరణాలకు పాల్పడటం సమాజాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ప్రేమను అంగీకరించలేదని జనగామ జిల్లాలో ఇద్దరు మైనర్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Honor Killing: young man murdered in chittoor district
Honor Killing: young man murdered in chittoor district

ఇక నల్లగొండ జిల్లాలో అమృత భర్త ప్రణయ్, హైదరాబాద్ లో అవంతిక రెడ్డి భర్త హేమంత్ కుమార్ ల దారుణ హత్యలు పరువు హత్యలుగానే తేలాయి.  ఆ తరువాత ఏపిలోని కర్నూలు జిల్లాలో ఓ యువకుడు పరువు హత్యకు గురయ్యాడు. తాజాగా చిత్తూరు జిల్లాలో తన కుమార్తెను ప్రేమిస్తున్నాడని ఆమె తండ్రి ఆ యువకుడిని దారుణంగా హత్య చేసి శవాన్ని ముక్కలుముక్కలుగా చేసి గ్రామ శివారులో మృతదేహాన్ని ఖననం చేయడం తీవ్ర సంచలనం కల్గించింది. తన కుమార్తెను  ప్రేమించడమే అ యువకుడు చేసిన నేరంగా భావించిన  ఆ యువతి తండ్రి అతి కిరాతంగా ప్రవర్తించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Read More: Man Chews Snake: అతను పామును నమిలి మింగేశాడు..! ఎందుకో తెలిసి అందరూ షాక్ అయ్యారు..!!

విషయం ఏమిటంటే.. పలమనేర మండలం పెంగరగుంటకు చెందిన ధనశేఖర్ (23) బెంగళూరులో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఈ యువకుడు అదే గ్రామానికి చెందిన బాలిక గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.  ఈ క్రమంలోనే గత అయిదు రోజులు క్రితం ధనశేఖర్ అదృశ్యమైయ్యాడు. అతని మృతదేహం ఉదయం పొలంలో కనిపించడంతో యువకుడి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తమ కుమారుడు ప్రేమించిన యువతి తండ్రి బాబు ఈ హత్య చేశాడంటూ వారు ఆరోపించారు. ధనశేఖర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ యువతి తండ్రి బాబు సెల్ ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు. గత శనివారం రాత్రి 10 గంటలకు బాలిక తండ్రి నుండి ధనశేఖర్ కు ఫోన్ కాల్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై బాబును పోలీసులు విచారించగా శనివారం రాత్రి ధనశేఖర్ తన కుమార్తెతో ఉండటాన్ని చూశాననీ, ఆవేశం ఆపుకోలేక ధనశేఖర్ ను కత్తితో పొడిచి చంపినట్లు అంగీకరించాడు.

ఆ తరువాత గ్రామ శివారులోని బావిలో అతని మృతదేహాన్ని పడేశాననీ, సోమవారం బావిలో మృతదేహాం తేలడాన్ని గమనించి మృతదేహాన్ని బయటకు తీసి ముక్కలుగా చేసి పొలంలో పాతిపెట్టినట్లు అతను పోలీసులకు వివరించాడు. దీంతో బాబును పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హజరుపర్చారు. ఇటువంటి ఘటనలు కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తుండగా, పలు ప్రాంతాల్లో జరిగిన ఘటనలు స్థానిక సెటిల్‌మెంట్లతో వెలుగుచూడటం లేదు.

 


Share

Related posts

రవితేజ ఊపు టాలీవుడ్ లో మరే హీరోకి లేదు… ఇదంతా ఒక్క క్రాక్ సినిమా కోసమే ..!

GRK

హైకోర్టు సాక్షిగా మరోసారి రాజధానిపై స్పష్టం చేసిన జగన్ ప్రభుత్వం..!

Muraliak

శివకుమారస్వామి శివైక్యం

Siva Prasad