అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆ పార్టీ నాయకుడు బ్రహ్మం చౌదరిపై గుడివాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఇటీవల పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర స్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్న విషయం తెలిసిందే.
అయితే దేవినేని ఉమాపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై బ్రహ్మం చౌదరి…మంత్రి కొడాలి నానిని విమర్శిస్తూ ఆయన కుటుంబ సభ్యులపై అసభ్య పదజాలాన్ని వాడారు. బ్రహ్మం చౌదరి చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై వైసీపీ కార్యకర్త ఒకరు గుడివాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దేవినేని ఉమా ప్రోత్సాహంతోనే బ్రహ్మం చౌదరి అసభ్యపదజాలం వాడుతూ విమర్శలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై దేవినేని ఉమా, బ్రహ్మం చౌదరిలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.