Pawan Kalyan: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా పూజా హెగ్డే చలామణి అవుతోంది. ఇండస్ట్రీలో ఎటువంటి టాప్ ప్రాజెక్టు అయినా.. చాలా వరకు పూజ నే సంప్రదిస్తున్నారు డైరెక్టర్లు. గత ఏడాది “అలా వైకుంఠపురం లో” సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ… ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ప్రభాస్ తో రాధేశ్యాం తో పాటు కొన్ని బాలీవుడ్ సినిమాలు అదే రీతిలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న సినిమా ఆఫర్లు దక్కించుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో బిగ్గెస్ట్ ఆఫర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో పూజాహెగ్డే అందుకున్నట్లు లేటెస్ట్ టాక్.
విషయంలోకి వెళితే హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఈ సినిమా ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన చేయడం జరిగింది. గబ్బర్ సింగ్ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే వచ్చే వారం పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సినిమా టైటిల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.
ఇటువంటి తరుణంలో తన సినిమాలలో లక్కీ హీరోయిన్ గా పేరు సంపాదించిన పూజా హెగ్డే..నీ మరోసారి తీసుకోవడానికి డైరెక్టర్ హరీష్ శంకర్ రెడీ అయినట్లు తెలుస్తోంది. గతంలో డీజే, గద్దల కొండ గణేష్ వంటి సినిమాలలో హీరోయిన్ గా పూజ హెగ్డే ని చేయించగా.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సరసన చేయించటానికి కూడా హరీష్ ప్లాన్ చేసినట్లు సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!