NewsOrbit
న్యూస్ హెల్త్

రోజూ బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల కలిగే లాభాలివే..?

మనం చేసే అతి చిన్న పొరపాట్లు ఒక్కోసారి వివిధ అనర్థాలకు దారితీస్తాయి. మరీ ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం విషయంలో సరైన ఫుడ్ ను తీసుకోకుంటే అది మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపెడుతుంది. ముఖ్యంగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను తీసుకుని విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. కాని కొందరు ఉద్యోగస్తులు మాత్రం ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను ఇగ్నోర్ చేసి మధ్యాహ్నం , నైట్ పూట మాత్రమే ఆహారాన్ని తీసుకుంటున్నారు. కాని సామాన్యులు మాత్రం ఉదయం పూట వాళ్లకు తోచింది తింటారు. కాని కొందరైతే ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను తీసుకోకపోవడంతో అనారోగ్యం పాలవుతున్నారని నిపుణులు తెలుపుతున్నారు.

బ్రేక్ ఫాస్ట్ ను తీసుకోకపోవడం వలన ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రేక్ ఫాస్ట్ చేయకపోయినట్టైతే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి బరువు పెరిగే అవకాశముంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనితో పాటుగా మతిమరుపు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఉదయం పూట తినక పోవడం వల్ల మధ్యాహ్నం పూట అధికంగా తినే అవకావాలున్నాయి. దీని మూలంగా శరీర బరువు మరింత పెరుగొచ్చని తెలుపుతున్నారు. అంతే కాకుండా మెదడు సరిగ్గా పనిచేయకపోవడం మూలంగా మనం చేస్తున్న పని పట్ల కూడా ఆసక్తి తగ్గే అవకాశాలు చాలానే ఉన్నాయి. అయితే బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల ఎన్నో రకాల ఉపయోగాలున్నాయని నిపుణులు సూచిస్తున్నారు.

ఉదయం తినడం మూలంగా ఆ రోజంతా ఎలాంటి పనులనైనా అలసటకు గురికాకుండా ఉత్సాహంగా చేయగలుగుతామని నిపుణులు చెబుతున్నారు. అలాగే మన శరీర బరువు కూడా అదుపులో ఉంటుంది. అయితే మధ్యాహ్నం, రాత్రి పూట తీసుకునే ఆహారం కన్నా ఉదయం తీసుకునే ఆహారం వల్లనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అలాగే ప్రతి రోజు క్రమం తప్పకుండా మంచి ఆహార పదార్థాలను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే షుగర్ వ్యాధి దరిచేరట. అలాగే కొలెస్ట్రాల్ పెరగడం, హై బీపీ వంటి సమస్యలు కూడా రావని నిపుణులు తెలుపుతున్నారు.

మరీ ముఖ్యంగా షుగర్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయిని నిపుణులు సూచిస్తున్నారు. బ్రేక్ ఫాస్ట్ మూలంగా మన శరీరం హెల్తీగా ఉంటుందని చెబుతున్నారు. కాని బ్రేక్ ఫాస్ట్ ను చేయకుంటే మాత్రం అనేక రకాల హెల్త్ సమస్యలు మిమ్మల్ని చుట్టు ముట్టే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే బ్రేక్ ఫాస్ట్ లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి.అలాగే అధిక కొవ్వు శాతం ఉండే బ్రేక్ ఫాస్ట్ కు దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎవరైనా బ్రేక్ ఫాస్ట్ ను ఇగ్నోర్ చేసేవాళ్లుంటే ఇప్పటికైనా అలవాటు చేసుకుని తినడం మంచిది.

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!