ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

Rains In AP Telangana: ఏపీ, తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు

Share

Rains In AP Telangana: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరో రెండు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని వల్ల ఎపీ, తెలంగాణలో నేటి నుండి మూడు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని చెప్పింది. భారీ వర్ష సూచనతో కొన్ని జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది . కోస్తాంధ్రలో భారీగా వర్షాలు పడతాయి. కొన్ని చోట్ల ఎండ కాస్తున్నా కూడా వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.

Rains In AP Telangana

 

పార్వతీపురం, మణ్యం, శ్రీకాకుళం (పశ్చిమ భాగాలు), విజయనగరం, అనకాపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. అదే విధంగా రాజమహేంద్రవరం, కాకినాడ నగరాలతో పాటు తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయి. చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం, సత్యసాయి జిల్లాలతో పుట కనడప జిల్లా పశ్చిమ ప్రాంతాలు, కర్నూలు, నంద్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. పల్నాడు, తిరుపతి జిల్లా పశ్చిమ భాగాల్లో అక్కడక్కడ వర్ష సూచన ఉంది. కొన్ని ప్రదేశాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తీరం వెంట గంటకు 40 నుండి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి.

ముఖ్యమంత్రి కావాలన్న కోరిక తీరకముందే మంత్రి గానే..

ఇక తెలంగాణ విషయానికి వస్తే.. రాష్ట్రంలో మరో నాలుగు రోజులు మోస్తరు నుండి భారీ వర్షాలు కురవనున్నయి. భారీ వర్ష సూచనతో హైదరాబాద్ వాతావరణ కేంద్రం పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ రోజు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, జనగామ, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, సూర్యపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ నెల పదవ తేదీ వరకూ వర్షాలు కురుస్తాయని అధికారలు అంచనా వేశారు.

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు..ఎందుకంటే..?


Share

Related posts

Dry Hair: జుట్టు రఫ్ గా ఉందా..!? ఆలివ్ ఆయిల్ లో ఇది కలిపి రాయండి..!

bharani jella

ఎందుకని ప్రకాశం జిల్లాపై బాబు శీతకన్ను వేశారు?

Yandamuri

Devatha Serial: ఆదిత్య ఫోన్ లో దేవి ఫోటోలు డిలీట్ చేసిన సత్య.! ఆఫీసర్ సార్ పేరే ఎత్తద్దన్న దేవి..!

bharani jella