NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

ఇంద్రకీలాద్రిపై కొండచరియ ఎలా విరిగిపడిందంటే…!!

 

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు కొనసాగుతున్నాయి. శరన్నవరాత్రి వేడుకల్లో అయిదవ రోజు బుధవారం మూలానక్షత్రం పురస్కరించుకుని దుర్గామాతను సరస్వతి దేవిగా అలంకరించారు. సరస్వతి దేవి అలంకారంలో ఉన్నఅమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు మెట్లు ఎక్కి వెళుతున్నారు. మరో పక్క నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆలయానికి వస్తుండటంతో పెద్ద ఎత్తున పోలీసులు అధికారులు, సిబ్బంది ఆలయం వద్ద బందోబస్తు విధులను నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకుని భక్తుల రాకపోకలు ఆ వైపు నిలిపివేశారు. ఒక వైపు భక్తులు అందరూ మెట్లు ఎక్కి వెళ్లిపోతుండటం, అక్కడ పోలీసు అధికారులు బందోబస్తు నిర్వహిస్తున్న సమయంలో ఒక్క సారిగా కొండచరియ విరిగి పడటం ఆ ప్రదేశంలో నిల్చున్న వారు అంతా ఒక్క సారిగా పరుగు లంకించుకున్నారు. చాలా మంది స్వల్పగాయాలతో బయటపడ్డారు. అక్కడ ఉన్న రేకుల షెడ్డు పూర్తిగా దెబ్బతిన్నది.

ఇటీవల కురిసిన వర్షాల కారణంగా చిన్న చిన్న రాళ్లు పడుతూ ఉండటంతో అధికారులు అప్రమత్తమై పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. కొండ చరియలు విరిగి పడే అవకాశం ఉందని ఇంజనీరింగ్ అధికారుల హెచ్చరికలతో అక్కడ హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. ఉత్సవాల సమయంలో ఈ ఘటన జరగడం భక్తులను తీవ్ర భయాందోళనను కల్గించింది. ముఖ్యమంత్రి పర్యటనకు కొద్ది సేపటి ముందు ఈ ఘటన జరగడంతో అధికారులు ఉరుకులు పరుగుల మీద సహయక  చర్యలు చేపట్టడంతో పాటు శిధిలాల తొలగింపు యుద్ధ ప్రాతిపదికన చేశారు. అనంతరం ముఖ్యమంత్రి కొండచరియలు పడిపోయిన ప్రదేశాన్ని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

 

కొండ చరియ ఎలా విరిగిపడిందో ఈ కింది వీడియోలో చూడండి…

 

Related posts

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju