NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

మెట్రో ప్రయాణికులకు మ‌రో ‘బంప‌ర్ ఆఫ‌ర్’!

మెట్రో రైల్ వ‌చ్చిన కొద్ది రోజుల్లోనే ప్ర‌యాణికులు లేక వెల‌వెలబోయింది. దానికి కారణం అది పెట్టిన చార్జీలే. దాంతో రోజు రోజుకూ ప్ర‌యాణికుల సంఖ్య త‌గ్గుతూ వ‌చ్చింది. చార్జీను త‌గ్గించ‌డం లేదు కానీ ప‌లు ఆఫ‌ర్ల‌తో ప్ర‌యాణికుల‌ను ఆక‌ట్టుకునే ప‌నిలో ప‌డింది మెట్రో. ఇప్ప‌టికే ప‌లు ఆఫ‌ర్లు ఇస్తూ వ‌చ్చిన మెట్రో మ‌రోసారి ఇంకో ఆఫ‌ర్ ని అందించేందుకు సిద్ధ‌మైంది.

అందులో భాగంగా హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు ఆదివారం నుంచి బంపర్‌ ఆఫర్‌ అందుబాటులోకి రానుంది. దీని గురుంచి మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. మెట్రో స్మార్ట్ రీఛార్జ్‌పై 50% వరకు క్యాష్ బ్యాక్ వ‌చ్చే ఆఫ‌ర్ ను ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అయితే ఈ క్యాష్ బ్యాక్ లిమిట్ రూ.600 వరకు ఉంటుంద‌ని మెట్రో ఎండీ తెలిపారు. మెట్రో స్టేషన్లలో రీఛార్జు చేసుకునే వారికి కాకుండా, ఆన్‌లైన్‌లోనూ రీఛార్జ్‌ చేసుకునే వారికి కూడా ఈ ఆఫర్ వర్తించనుందని ఎన్వీఎస్ తెలిపారు.

ఈ క్యాష్ బ్యాక్ స్మార్ట్ కార్డులోనే జమ అవుతుందని పేర్కొన్నారు. కానీ రీఛార్జ్‌ చేసుకున్న మొత్తాన్ని 90 రోజుల్లోనే వాడుకోవాల‌ని కండిష‌న్ పెట్టిన‌ట్లు ఎన్వీఎస్ రెడ్డి ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. న‌గ‌ర ప్ర‌జ‌లు మెట్రోలో ప్రయాణించేందుకు ఆస‌క్తి చూపుతున్నార‌ని ఆయ‌న తెలిపారు.న‌గ‌రంలోనున్న మూడు కారిడార్ల‌లో క‌లిపి రోజు 1.30 ల‌క్ష‌ల మందిదాక మెట్రోలో ప్ర‌యాణం చేస్తున్న‌ట్లు ఎన్వీఎస్ పేర్కొన్నారు. ఇప్ప‌టివ‌ర‌కే ప్ర‌క‌టించిన మెట్రో సువ‌ర్ణ ప్యాకేజీలో 40 శాతం రాయితీ ప్ర‌క‌టించిన విష‌యాన్ని గుర్తు చేశారు ఎన్వీఎస్. దీని వ‌ల్ల మెట్రోలో ప్ర‌యాణం చేసే వారి సంఖ్య 30శాతం పెరిగింద‌ని తెలిపాడు.

దాంతో ఇప్పుడు కూడా మ‌ళ్లీ ఇంకో పండ‌గ ఆఫ‌ర్ ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు మెట్రో ఎండీ పెర్కొన్నారు. అందులో భాగంగానే మెట్రో సువర్ణ ఆఫర్ పేరుతో మ‌ళ్లీ 40 శాతం వరకూ క్యాష్ బ్యాక్ అందించేందుకు సిద్ధ‌మైన‌ట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ తెలిపారు. అక్టోబరు 17 నుంచి ఈ నెలాఖరు వరకు ఈ ఆఫర్లు వర్తిస్తాయని ఆయ‌న తెలిపారు. వ‌ర్ష‌ల వ‌ల్ల నగరంలో రోడ్లు దెబ్బతిన్నాయని, ప్రజ‌ల‌కు ప్రయాణం కష్టంగా మారిందని ఆయ‌న తెలిపారు. వారి ప్ర‌యాణాల‌ను ప్రోత్స‌హించేందుకే ఈ ఆఫ‌ర్లు తీసుకొచ్చిన‌ట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ తెలిపారు.

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju