న్యూస్

Hyderabad News: తప్పతాగి.. ఆ యువతీ ఏం చేసిందో చూడండి..!!

Hyderabad News: Police Got Tension
Share

Hyderabad News: యువత మద్యానికి బానిసవుతున్నారు.. లింగబేధాలు మరచి తప్పతాగుతున్నారు.. తాగడం వరకు ఒకే.. అది స్వేచ్ఛ అనో, హక్కు అనో చెప్పుకుంటారు.. కానీ తప్పతాగి ఇష్టానుసారం చేస్తేనే ఎదుటి వాళ్లకు బాగా కాలుతుంది. ఈరోజు హైదరాబాద్ లో అదే జరిగింది. ఓ యువతీ మద్యం మత్తులో రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఓ కారు నడిపి బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడిపిన ఆమె రోడ్డుపై వెళుతున్న వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంకా కారు అదుపులో లేక రోడ్డు పక్కనే వేగంగా వెళ్తుండడంతో.. కారును స్థానికులు అడ్డుకున్నారు. వారితో కూడా యువతి, వాహనంలో ఉన్న మరో వ్యక్తి వాగ్వాదానికి దిగారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.., పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మద్యం మత్తులో ఉన్న యువతి, ఆమెతో ఉన్న వ్యక్తిని పీఎస్‌కు తరలించారు. కారులో ఉన్న వారు మద్యం తాగినట్లు బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలో తేలిందని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Hyderabad News: Police Got Tension
Hyderabad News: Police Got Tension

Hyderabad News: నెలలో నాలుగో ఘటన..!

హైదరాబాద్ పరిసరాల్లో ఈ తరహా ఘటనలు ఎక్కువవుతున్నాయి. జనవరి నెలలోనే చూసుకుంటే ఇది నాలుగోది. నూతన సంవత్సరం రోజున జూబ్లీహిల్స్ లో ఓ యువతీ ఇలాజె చేసింది. నడిరోడ్డుపై హల్చల్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత పంజాగుట్టలో ఓ యువతీ అర్ధనగ్నంగా ఈ విధంగానే చేసింది. గతవారం కొండాపూర్ లో తాజాగా ఈమె.. ఇలా మెట్రో నగరంలో యువతులకు ఈ తరహా సంస్కృతి పెరుగుతుండడంపై నగర వాసుల్లో ఆందోళన ఎక్కువవుతుంది..!


Share

Related posts

Petrol price: కేంద్రం ప్రజలకు త్వరలో గుడ్ న్యూస్ అందిస్తుందట..! ఆ కేంద్ర మంత్రి ఉవాచ..!!

somaraju sharma

Deepthi bhatnagar: 13 ఏళ్ళ తర్వాత అంతే అందంతో ఎంట్రీ ఇస్తున్న రాఘవేంద్ర రావు హీరోయిన్ దీప్తి భట్నాగర్

GRK

Sunny: దీప్తి, షన్ను బ్రేకప్ పైన బిగ్ బాస్ విన్నర్ సన్నీ ఊహించని రెస్పాన్స్.!

Ram
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar