Dhee 13 : షో ప్రస్తుతం ఫుల్లు జోష్ లో ఉంది. ఢీ షో Dhee 13 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఎన్ని సీజన్లు మారినా.. ఆ షోకు ఉన్న క్రేజే వేరు. డ్యాన్స్ కు వేరే అర్థాన్ని తీసుకువచ్చిన షో అది. డ్యాన్స్ అంటే ఇంతేనా అని అనుకునేవాళ్లు ఢీ షో చూస్తే చాలు.. అసలు డ్యాన్స్ అంటే ఏంటో తెలుస్తుంది. అద్భుతమైన డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ తో పాటు.. కాసింత వినోదం కూడా యాడ్ చేస్తారు ఈ షోలో.

ఈ షోకు జడ్జిలు ఎంత ముఖ్యమో… యాంకర్ కూడా అంతే ముఖ్యం. యాంకర్ ప్రదీప్ తో పాటు హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీలు కామెడీని పంచడంలో నెంబర్ వన్.
Dhee 13 : ప్రతిసారీ సుధీన్ నే టార్గెట్ చేస్తూ?
నిజానికి.. సుడిగాలి సుధీర్ కు ఉన్న ఫాలోయింగ్ చాలా ఎక్కువ. బుల్లితెర మీద వచ్చే అందరు కమెడియన్ల కన్నా.. ఎక్కువ పాపులారిటీ ఆయనకే ఉంది. సుధీర్ అంటేనే డౌన్ టు ఎర్త్. చాలా సింపుల్ గా ఉంటాడు.
అయితే.. సుధీర్ సింప్లిసిటీని అవకాశంగా తీసుకొని.. ప్రతి సారీ.. ఢీషోలో సుధీర్ పై జోకులు పేల్చుతున్నారు. యాంకర్ ప్రదీప్ తో పాటు హైపర్ ఆది, రష్మీ.. ముగ్గురూ సుధీర్ పైనే జోకులు పేల్చుతుంటారు. దాని నుంచి వచ్చే కామెడీని ప్రేక్షకులు ఆస్వాదించాలా?
ముఖ్యంగా హైపర్ ఆది అయితే.. సుధీర్ ను టార్గెట్ చేసి.. కామెంట్లు చేసి.. ఆయన మీద జోకులు వేసి కామెడీని జనరేట్ చేస్తున్నాడు. తాజాగా విడుదలైన ప్రోమోలో కూడా అదే జరిగింది.
దీనిపై నెటిజన్లు, సుధీర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏంటి.. ఆది కామెడీ చెయ్యాలంటే ఎప్పుడూ సుధీర్ ను టార్గెట్ చేయడమేనా? వేరే పని లేదా? ఎప్పుడూ సుధీర్ ను టార్గెట్ చేయడం.. ఆయనపై జోకులు పేల్చడం.. ఇకనైనా కొత్తగా ఆలోచించండి.. అంటూ హైపర్ ఆదిపై కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
చూద్దాం మరి.. ఇకనైనా హైపర్ ఆది కొత్తగా ట్రై చేసి.. కామెడీని పండిస్తాడో లేక.. అలాగే సుధీర్ ను టార్గెట్ చేసుకుంటాడో? దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.. మీరు కూడా ఓ లుక్కేసుకోండి.