టీమ్ ఇండియా ఆటగాడు యుజువేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే తన డ్యాన్స్ స్టెప్పులతో ఇరగదీసే ధనశ్రీ.. ఈ మధ్యకాలంలో తన ఫోటోలు, వీడియోల్లో గ్లామర్ డోస్ పెంచినట్లు కనిపిస్తోంది. వృత్తిపరంగా వైద్యురాలు అయినప్పటికీ.. మంచి డ్యాన్సర్ అనే విషయం అందరికీ తెలిసిందే. డాక్టర్ వృత్తిని వదిలేసి డ్యాన్స్ కొరియోగ్రఫర్‌గా కొనసాగుతున్నారు. ధనశ్రీ పేరిట ఒక డ్యాన్స్ అకాడమీ కూడా ఉంది. అలాగే సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా రన్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా కనిపిస్తుంటారు. రీల్స్, డాన్స్, ఫోటోలు షేర్ చేస్తూ తన క్రేజ్‌ను పెంచుకుంటూ పోతుంది.

ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలొయింగ్ ఉంది. ఆమె పోస్ట్ పెట్టిన పది నిమిషాల్లో ఆ ఫోటో లేదా వీడియో వైరల్ అవ్వడం కామన్. ఇప్పటివరకు టీమ్ ఇండియాలో మాజీ ఆటగాళ్లతోపాటు యంగ్ ప్లేయర్లతో కలిసి డ్యాన్సులు చేసింది. ప్రస్తుతం ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 5.3 మిలియన్ ఫాలొవర్స్ ఉన్నారు. ఆమె డ్యాన్స్ చేసిన వీడియోలకు స్టార్ సెలబ్రిటీలు కూడా స్టెప్పులు వేస్తుంటారు.

ధన్య శ్రీ వర్మ ఎవరు?
వృత్తిపరంగా ధన్యశ్రీ వర్మ ఓ డాక్టర్. ఆమె తండ్రి సాగర్ వర్మ వ్యాపారవేత్త. తల్లి వర్ష వర్మ డెంటిస్ట్. దాంతో తొలత డాక్టర్ కావాలని ధన్యశ్రీ అనుకుంది. కానీ డాక్టర్ కంటే డ్యాన్స్ పైనే ఎక్కువ ఇంట్రెస్ట్. వైద్యురాలిగా తన వృత్తిని మధ్యలోనే ఆపేసి.. డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా మారింది. అలాగే సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుని అందులో అన్ని రకాల వీడియోలు షేర్ చేస్తుంటుంది. యుజేందర్ చాహల్‌తో 22 డిసెంబర్ 2020న వివాహం చేసుకుంది.

కాగా, ప్రస్తుతం టీమ్ ఇండియా భారత్- శ్రీలంక వన్డే సిరీస్ ఆడనుంది. టీమ్ ఇండియా లెగ్ స్పిన్నర్ చాహల్‌ను 2023 వరల్డ్ కప్ జట్టులోకి తీసుకుంటారా? లేదా? అనే ప్రశ్నార్థకంగా మారింది. 2020లో ఆడిన 14 మ్యాచుల్లో మొత్తంగా 21 వికెట్లు మాత్రమే తీశాడు. అందుకే ఈ వరల్డ్ కప్‌లో సేఫ్ సైడ్‌లో లేడని చెప్పవచ్చు.