BrahmaMudi:బ్రహ్మముడి సీరియల్ లో రాజ్ తల్లి పాత్రలో అపర్ణ క్యారెక్టర్ లో శ్రీ ప్రియ నటిస్తుంది. స్టార్ మా సీరియల్స్ లో బ్రహ్మముడి సీరియల్ టాప్ టి ఆర్ పి రేటింగ్ తో దూసుకుపోతుంది. ఈ సీరియల్ లో నటించే ప్రతి ఒక్కరూ వారి వారి క్యారెక్టర్స్ కి తగ్గట్టుగా అద్భుతంగా నటిస్తూ ప్రేక్షకు ఆదరణ పొందుతున్నారు. ఇక ఈ సీరియల్ లో గయ్యాళి అత్త పాత్రలో, కోడల్ని ఎప్పుడూ ఏదో ఒకటి అంటూ, కొంత నెగిటివ్ క్యారెక్టర్ కూడా చేస్తున్నారు శ్రీ ప్రియ. కొడుకు అంటే అమితమైన ప్రేమ చూపించే తల్లి పాత్రలో శ్రీప్రియ జీవిస్తుందనే చెప్పొచ్చు. టీవీ ఇండస్ట్రీలో 20 ఏళ్ల అనుభవం ఉన్న శ్రీ ప్రియ గురించి అందరికీ తెలిసిందే. మరి ఆమె కూతురు ఒక హీరోయిన్ అన్న విషయం తెలుసా ఎవరికైనా?

బ్రహ్మముడి వైదేహి పర్యనాయం సీరియల్స్ తో బుల్లితెర మీద ఆడియన్స్ కి ప్రతిరోజు కనిపిస్తూ ఉంటారు నటి శ్రీ ప్రియ. ముఖ్యంగా బ్రహ్మముడి సీరియల్ లో అయితే మానస్ కి తల్లిగా ఆమె నటన అద్భుతం అని చెప్పొచ్చు కొంత నెగిటివ్ క్యారెక్టర్ కొంత పాజిటివ్ క్యారెక్టర్ లో బ్రహ్మముడి సీరియల్ లో అపర్ణ క్యారెక్టర్ లో శ్రీ ప్రియ అద్భుతంగా నటిస్తున్నారు. ఈమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఉండదు ఎందుకంటే ఈవిడ మొదట్లో జెమిని టీవీలో సూపర్ హిట్ సీరియల్ అయినా మొగలిరేకులు లో కూడా యాక్ట్ చేశారు. మొగలిరేకులు నుంచి ప్రస్తుతం బ్రహ్మముడి వరకు ఆమె చేసిన ప్రతి సీరియల్ సూపర్ హిట్.

ఇక ఈమె కూతురు చరిష్మా శ్రీకర్ గురించి చాలామందికి తెలియదు. శ్రీ ప్రియ కూతురు చరిష్మా ఇప్పటికే కొన్ని చిత్రాల్లో నటించింది నీతోనే హాయ్ హాయ్ ఆర్ యు మ్యారీడ్ వంటి చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించింది చరిష్మా. ఇక రీసెంట్గా జగపతిబాబు మమతా మోహన్ దాస్ నటించిన రుద్రాంగి చిత్రంలో ఒక కీరోలు పాత్ర పోషిస్తుంది శ్రీ ప్రియ కూతురు చరిష్మా. వెండితెరపై హిట్ అయ్యేందుకు చరిష్మా ప్రస్తుతం ప్రయత్నిస్తుందని చెప్పచ్చు ఇక ఈమె సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్ గా ఉంటుంది ఎప్పటికప్పుడు తన కుటుంబాల్ని షేర్ చేస్తూ ఆడియన్స్ కు దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. రీసెంట్ గా తన తల్లి పుట్టిన రోజుకు కూడా చరిష్మా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఆ ఫోటోలను శ్రీ ప్రియ కూడా షేర్ చేసుకుంది. ఇప్పుడు ఈమె కూతుర్ని చూసి తల్లికి తగ్గ కూతురు అని నటనలో అనిపించుకోవాలి. తల్లి బుల్లితెర మీద ఒక వెలుగు వెలుగుతుంటే కూతురు వెండి ధర మీద ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇప్పుడు ఈమె తీస్తున్న రుద్రాంగి సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని ఈ సినిమాతో నటిగా గుర్తింపు రావాలని కోరుకుందాం. ఇప్పుడు ఆమె ఫోటోలను మనము చూసి, ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం..