NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

ఐపీఎల్ : పంజాబ్ కథకు చెన్నై శుభం కార్డు

(న్యూస్ ఆర్బిట్ స్పెషల్ బ్యూరో )

ముందు అంత ప్రదర్శన చేయకున్నా కీలకమయ్యే సమయంలో వరుసగా 5 మ్యాచ్ లు గెలిచి ఐపీఎల్ ప్లేఆఫ్ రేసులోకి వచ్చిన పంజాబ్ కింగ్స్ యుద్ధం చివరి దశలో ఉన్నపుడు చేతులు ఎత్తేసారు. ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన చెన్నై సూపర్ కింగ్స్ గత రెండు మ్యాచుల్లో అద్భుతమైన ఫామ్ లోకి వచ్చింది. ఆదివారం నాటి మ్యాచ్లో పంజాబ్ ను చిత్తు చేసి, తనతో పాటే ప్లే ఆపరేషన్ నుంచి నిష్క్రమించేలా చేసింది. ఈసారి ఎలాగైనా ప్లేఆఫ్ నుంచి కప్పును సాధించాలన్నా పంజాబ్ యాజమాన్యం కలలు ఈసారికూడా తీరలేదు.

అవకాశాలు అందిపుచ్చుకుని పంజాబ్!!

పంజాబ్ టీం ను చూస్తే చాలా బలంగా కనిపిస్తుంది. క్రిస్ గేల్ టీమ్ లో జాయిన్ అయిన తర్వాత టీమ్ మరింత బలం పుంజుకుంది. అయితే కీలకమైన మ్యాచ్లో మాత్రం చేతులెత్తేయడం ఇప్పుడు పంజాబ్ అభిమానులను నిద్ర లేకుండా చేసింది. కెప్టెన్గా కేఎల్ రాహుల్ అత్యధిక పరుగులు నమోదు చేసి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. అయితే టీమ్ను సమన్వయ పరచడం లో అతడు సరైన దృష్టి సారించ లేదని కేవలం ఎక్కువ రన్స్ చేసి వ్యక్తిగత ఆరెంజ్ క్యాప్ దక్కించుకోవడానికి మొగ్గు చూపడని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. కీలకమైన ఆదివారం మ్యాచ్లో కె.ఎల్.రాహుల్ ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. క్రిస్ గేల్ వరుసగా మంచి స్కోరు సాధించిన ఆదివారం నాటి మ్యాచ్లో ప్రభావం చూపలేక పోయాడు. మ్యాక్స్వెల్ పంజాబ్ జట్టు వరుసగా టీంలో ఆడించడం మరో తప్పిదం. భారీ షాట్లు కొట్టడానికి గ్రౌండ్లో తడబడుతున్న మాక్స్ వెల్ ను తప్పించే సాహసం పంజాబ్ ఎందుకు చేయలేదో అర్థం కానీ ప్రశ్న. నికోలస్ పూరన్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నా అతడికి సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు. కేవలం మిడిల్ ఆర్డర్ లో దింపి అడపా దడపా ఓవర్లు ఆడించారు. పూరన్ పవర్ ప్లే లో మంచి స్కోర్ రాబట్టే అవకాశం ఉన్నా పంజాబ్ కెప్టెన్, కోచ్ ఈ దిశగా ఆలోచించలేదు.
* చెన్నై వరుస విజయాల్లో లైం లైట్ లోకి వచ్చింది మాత్రం ఓపెనర్ రుతు రాజ్ గైక్వాడ్. వరుస మ్యాచ్ల్లో అర్ధ సెంచరీలు సాధించిన యువ బ్యాట్స్మెన్ చెన్నైకి ఇప్పుడు ఆశాకిరణం. మొదట అవకాశం ఇవ్వని గైక్వాడ్ ను తర్వాత ఓపెనర్గా పంపి చెన్నై ప్రయోగం చేసింది. ఈ ప్రయోగం 100% విజయవంతమైంది. వరుస ఓటముల తరువాత చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోని కుర్రాళ్ళ లో గెలుపు తాలూకా స్పార్క్ కనిపించడం లేదని చెప్పిన అనంతరం టీమ్ లోకి వచ్చిన గైక్వాడ్ కెప్టెన్ ఆశలను చిగురింప చేశాడు. జట్టు నాయకుడిగా ముందుండి నడిపిస్తాడు అని అనుకున్న ధోని, ఆల్రౌండర్గా మెరిపిస్తాడు అనుకున్న షేన్ వాట్సన్ లు ఈ ఐపీఎల్ సీజన్ లో పూర్తిగా వెనుకబడి ఉండడం చెన్నైకు ప్రతికూల అంశం.

కెప్టెన్లు ఒకరు ఓహో.. మరొకరు ఉహు.!!

ఆదివారం జరిగిన మరో కీలక మ్యాచ్లో కలకత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అద్భుతమైన పాటతో అలరిస్తే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్మిత్ మాత్రం తన తీసికట్టు ఆటతో అందర్నీ నిరాశపరిచాడు. బౌలింగ్ సమయంలో కెప్టెన్గా సరైన ప్రణాళిక వేయడం లోను స్మిత్ ఆలోచన ఎక్కడో దెబ్బతింది. 100 లోపు రన్స్ కే ఐదు వికెట్లు పడిపోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న కోల్కతా టీం ను వెంటనే దెబ్బ తీసే ఎదురుదాడి చేయించలేదు. కేవలం రక్షణాత్మక బౌలింగ్ కు ప్రాధాన్యం ఇవ్వడంతో కోల్ కత పుంజుకుంది. స్కిప్పెర్ మోర్గాన్ విరుచుకుపడడంతో కోల్కత భారీ స్కోరు సాధించింది. చేజింగ్ లో మంచి రికార్డు ఉన్న రాజస్థాన్ ఈసారి పూర్తిగా చేతులు ఎత్తేసింది. ఒకరి తర్వాత ఒకరు బ్యాట్స్మెన్లు పెవిలియన్ కు దారి పట్టడంలో రాజస్థాన్ కథ ముగిసిపోయింది.

ఇంకా ఉంది ప్లే ఆఫ్ కథ!!

ఆదివారం నాటి రెండు మ్యాచుల్లో పంజాబ్ రాజస్థాన్ లు ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించినా, ఇంకా దీనిలో అసలు కథ పూర్తి కాలేదు. ఇప్పటికే ప్లేయర్ బెర్తు దక్కించుకున్న ముంబై ముందు వరుసలో ఉంటే, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, కోల్ కతలు మూడు స్థానాల కోసం పోటీ పడుతున్నాయి. సోమవారం జరిగే ఢిల్లీ బెంగళూరు మ్యాచ్లో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు రెండో స్థానానికి వెళ్లి పోతుంది. ఇక మూడు నాలుగు స్థానాల కోసం నెట్ రన్ రేట్ ఆధారంగా మాత్రమే ప్లే ఆఫ్ బెర్త్ ఉంటుంది. హైదరాబాద్ జట్టు రన్ రేట్ విషయంలో మెరుగ్గా ఉంది. మంగళవారం ముంబై తో మ్యాచ్ నెగ్గితే నేరుగా ప్లే ఆఫ్ చేరుకుంటుంది. ఢిల్లీ బెంగళూరు మ్యాచ్ లో నమోదు అయ్యే స్కోర్లు చేజింగ్ లు, రన్ రేట్ ను బట్టి బెంగళూరు టు ఢిల్లీ ఏ స్థానాల్లో ఉంటాయో తెలుస్తుంది. ఇక సోమవారం జరిగే బెంగళూరు ఢిల్లీ మ్యాచ్ తోపాటు మంగళవారం జరిగే హైదరాబాద్ ముంబై మ్యాచ్ లో నమోదు అయ్యే స్కోర్లు, జట్లు విజయాలు మీదనే కోల్ కత ఆశలు పెట్టుకోవాలి. మొత్తంగా ప్లే ఆఫ్ రేసు చివరి వరకు నడవటం ఈ సారి ఐ పీ ఎల్ ప్రత్యేకం.

author avatar
Special Bureau

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju