RRR: ఆర్ఆర్ఆర్ మూవీకి నెగిటివ్ ట్రోల్స్ మొదలు..ఇదే పబ్లిసిటీ అవుతుందా..?

Share

RRR: ఆర్ఆర్ఆర్..దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న పాన్ ఇండియన్ సినిమా. సహజంగా మామూలు కమర్షియల్ సినిమాలను తీసినప్పుడే కాంట్రవర్సీలు, ట్రోలింగ్స్ అవుతుంటాయి. వీటి వల్ల సినిమాకు డ్యామేజ్ అయ్యే విషయం పక్కన పెడితే పబ్లిసిటీ మాత్రం ఫ్రీగా అయిపోతుంటుంది. సినిమా టైటిల్ విషయంలో గానీ, సినిమాలో సాంగ్స్, డైలాగ్స్..ఇతర ఇతర విషయాలలో కొందరు మా మనోభావలను ఈ సినిమాలోని పాటలు, సాహిత్యం, పేర్లు..వగైరా వగైరా దెబ్బ తీసే విధంగా ఉన్నాయని వాపోతుంటారు. సినిమా రిలీజ్ కాకుండా కూడా అడ్డుపడుతుంటారు.

RRR: గద్దలకొండ గణేష్ అనే సినిమా టైటిల్ విషయంలో కూడా ఇలాంటి కాంట్రవర్సీ తలెత్తింది.

తప్పని పరిస్థితుల్లో మేకర్స్ ఎవరి మనోభావాలు దెబ్బ తీయాలనుకోవడం మా ఉద్దేశ్యం కాదని వారి అభ్యర్ధనల మేరకు అనుకున్న వాటిని సినిమాలో నుంచి తొలగిస్తుంటారు. కొన్ని సందర్భాలలో ఇది విపరీతమైన కాంట్రవర్సీ అయి కూడా కేసులు పెట్టిన సందర్భాలున్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గద్దలకొండ గణేష్ అనే సినిమా టైటిల్ విషయంలో కూడా ఇలాంటి కాంట్రవర్సీ తలెత్తింది. ముందు ఈ సినిమాకు అనుకున్న టైటిల్ వాల్మీకి. కానీ ఈ టైటిల్ పట్ల కొందరు అభ్యంతరాలు వ్యక్తపరచండంతో అప్పటికప్పుడు గద్దలకొండ గణేశ్ అని పేరు మార్చి సినిమాను రిలీజ్ చేశారు.

is negative trolls give publicity to rrr movie....?
is negative trolls give publicity to rrr movie….?

అంతకముందుకు కూడా హరీష్ శంకర్ దర్శకత్వంలోనే వచ్చిన దువ్వాడ జగన్నాధం సినిమాలో ఓ పాటకు సంబంధించిన సాహిత్యం కొందరి మనోభావాలను దెబ్బతీసేదిగా ఉందని అభ్యంతరాలు వెల్లడయ్యాయి. ఇలాంటివన్నీ సహజంగా పుట్టుకొచ్చేవే అయినా సినిమాకు కొన్ని సారు సమస్యలు తలెత్తి రిలీజ్ సమయంలో నిర్మాతలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. అలాంటి ఇబ్బందులు ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాకు వస్తాయని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే కొమరం భీం పాత్రలో నటిస్తున్న ఎన్.టి.ఆర్ పాత్రను పరిచయం చేసిన టీజర్‌లో ఆయన ముస్లిం టోపీ పెట్టుకున్నాడని కామెంట్ చేశారు. టీజర్ నుంచి ఆ షాట్స్ తొలగించాలని కూడా రాజమౌళిని ఒత్తిడి చేశారు.

RRR: నాటు నాటు సాంగ్ యూట్యూబ్‌లో ఎంతగా ట్రెండ్ అవుతుందో..అంతగా ట్రోల్ కూడా చేస్తున్నారు.

ఆ తర్వాత రాజమౌళి క్లారిఫికేషన్ ఇవ్వడంతో ఈ వ్యవహారం సద్దుమణిగింది. ఇప్పుడు మరోసారి ఆర్ఆర్ఆర్ సినిమా మీద కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా 2022లో జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో రాజమౌళి బృందం భారీ లెవల్‌లో ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇందులో భాగంగా తాజాగా చరణ్ – తారక్ లకు సంబంధించిన నాటు నాటు అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఎంతో గ్రాండ్‌గా ఉన్న ఈ సాంగ్ అందరినీ బాగా ఆకట్టుకుంటోంది. చాలాకాలం తర్వాత ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కంపోజ్ చేసిన హుషారైన స్టెప్స్‌కు చరణ్, తారక్ అదరగొట్టారు.

అయితే ఇది పోరాట యోధుల కథ. ఇందులో అలాంటి సాంగ్ పెట్టే ఆస్కారం ఎక్కడిది..అసలు చరిత్రను కించపరిచేలా సినిమాను తీస్తున్నట్టున్నారనే విధంగా రాజమౌళిని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నాటు నాటు సాంగ్ యూట్యూబ్‌లో ఎంతగా ట్రెండ్ అవుతుందో..అంతగా ట్రోల్ కూడా చేస్తున్నారు. మరి దీనిపై రాజమౌళి ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ఆయనకి జంటగా సీత పాత్రను బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ పోషిస్తోంది. ఇక తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా..ఆయనకు జంటగా బ్రిటన్ మోడల్ ఓలివియా మోరీస్ కనిపించబోతోంది.

 

 


Share

Related posts

మూడు రాజధానులకు జై కొట్టిన ఉత్తరాంధ్ర!

Mahesh

“18 పేజెస్” లో మెమరీ లాస్ అయిన యువకుడిగా నిఖిల్..?

GRK

పవన్ పిల్లలు: పోలేన – మార్క్ శంకర్ ఫొటోస్ వైరల్!

Naina