Pawan kalyan – Ajith: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఇప్పుడు ఎవరు ఢీ కొట్టాలన్నా కష్టమే అయిపోయింది. ఆయన క్రేజ్ అలాంటిది. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ రోజున మరో సినిమా రిలీజ్ అంటే ఆ నిర్మాతలకు నష్టాలే అని చాలా మంధి ఫిక్స్ అవుతున్నారు. మీడియం హీరో సినిమా అయితే అసలు కనిపించే ఛాన్సే లేదు. అదే పెద్ద బడ్జెట్ సినిమా అయితే అన్నిటికీ డిసైడయి పోటీకి దిగాలి. లేదా కనీసం వారం ముందు గానీ, వారం తర్వాత గానీ రిలీజ్ ప్లాన్ చేసుకోవాలి. అంత క్రేజ్ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఉంది.
అందుకే సంక్రాంతి రేసు నుంచి ఆర్ఆర్ఆర్ సినిమాకు గట్టి పోటీ అవుతుందని పవన్ కళ్యాణ్ – రానా నటించిన భీమ్లా నాయక్ సినిమాను తప్పించే ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతున్నాయి. ప్రస్తుతానికైతే ఆ ప్రయత్నాలు విఫలమే అయ్యాయి. అయితే పవన్ కళ్యాణ్ సినిమా 2022, సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న భారీ స్థాయిలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇదే రోజున తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన వలిమై కూడా రిలీజ్ కాబోతోంది. బాలీవుడ్ స్టార్ మేకర్ బోనీకపూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Pawan kalyan – Ajith: అజిత్ కుమార్‌కు విలన్‌గా నటిస్తున్నాడు.
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ ఇందులో అజిత్ కుమార్‌కు విలన్‌గా నటిస్తున్నాడు. అంతేకాదు కార్తికేయకు ఇది తమిళంలో డెబ్యూ సినిమా. అందుకే ఒకేరోజు రెండు భాషలలో రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే తెలుగులో డబ్బింగ్ వెర్షన్ కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమాతో పోటీ కాకుండా తర్వాత రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. తమిళంలో మాత్రం జనవరి 12నే వలిమై రిలీజ్ కానుందట. హెచ్ వినోద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇదే కాంబినేషన్లో బాలీవుడ్ హిట్ సినిమా పింక్ రీమేక్ నేర్కొండ పార్వై వచ్చి సూపర్ హిట్ సాధించింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!