ఇది కదా మెగాస్టార్ నుంచి అందరు కావాలని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసేది ..?

Share

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో 152వ చిత్రంగా ‘ఆచార్య’ తెరకెక్కుతుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మాట్నీ మూవీస్ బ్యానర్స్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ‘ఆచార్య’ ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయగా మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాని 2021 సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు కొరటాల ప్లాన్ చేస్తున్నాడు.

Acharya First Look Poster: Chiranjeevi Mass avatar - tollywood

రాష్ట్రంలోని దేవాలయాలు, పలు ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన ఎండోమెంట్స్ విభాగానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా మెగాస్టార్ ఈ సినిమాలో కనిపిస్తారని ముందు నుంచి వార్తలు వాస్తున్నాయి. కాగా తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం మెగాస్టార్ ఎండోమెంట్స్ విభాగానికి చెందిన అధికారిగా కేవలం పది నిముషాల ప్లాష్ బ్యాక్ లో మాత్రమే కనిపిస్తారని తెలుస్తుంది. అయితే ఆచార్య సినిమాకే ఈ రోల్ చాలా ప్రత్యేకంగా నిలవబోతుందని అంటున్నారు. అంతేకాదు కేవలం పది నిముషాలే కనిపిస్తారంటే ఖచ్చితంగా డ్యూయల్ రోల్ లో నటించబోతున్నట్టు ప్రచారం అవుతుంది.

ఇదే గనక నిజమైతే మెగాస్టార్ నుంచి అభిమానులు కి ఏం కావాలో ఆ అంశాలన్ని మిస్ అవకుండా ఆచార్య లో ఉంటాయని ఆతృఅతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. మెగాస్టార్ ఈ సినిమా కోసం బరువు తగ్గడంతో పాటు కంప్లీట్ గా కొత్త మేకోవర్ లో కనిపించనున్నారు. రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపించబోతున్నాడు. చరణ్ పాత్ర ఎమోషనల్ గా ఉంటుందని నిలుస్తోందట. ఇప్పటికే ఈ సినిమాలో ఉన్న ఒక స్పెషల్ సాంగ్ ని మెగాస్టార్, రెజీనాల పై చిత్రీకరించారు.


Share

Related posts

2వేల నోటు ఉంటుందా, పోతుందా?

somaraju sharma

Sonusood: తన ఫోటోకి పాలాభిషేకం చేసిన చిత్తూరు జిల్లా వాసులకి రిప్లై ఇచ్చిన సోనూసూద్

arun kanna

బ్రేకింగ్ : కరోనా కి వ్యాక్సిన్ కనిపెట్టిన తొలి దేశంగా భారత్..! విడుదల ఎప్పుడంటే….

arun kanna