NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ కి బ్లాక్ బస్టర్ గుడ్ న్యూస్ కేరాఫ్ వైజాగ్ !

ఏపీలో మూడు రాజ‌ధానుల ఏర్పాటు‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గ‌డంలేదు. వివిధ సంద‌ర్భాల్లో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌ద‌ర్శించే స్ప‌స్ట‌మైన వైఖ‌రి, రాష్ట్ర ప్ర‌భుత్వం అవ‌లంభిస్తున్న విధానాలు అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ విష‌యంలో ప్ర‌భుత్వం ఎంత‌టి స్ప‌ష్ట‌త‌తో ఉందో తేల్చి చెప్తోంది.

ఇదే స‌మ‌యంలో విశాఖ‌లో కార్య‌నిర్వాహ‌క రాజ‌ధానిన నిర్ణ‌యం సీఎం జ‌గ‌న్ అంత ఆషామాషీగా తీసుకోలేద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

విశాఖ‌… మినీ భార‌త్‌!
వైఎస్ఆర్‌సీపీ అధినేత‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నడూ లేని విధంగా విశాఖ నగరాభివృద్ధి కోసం రూ.1300 కోట్లు కేటాయించారు ఇ‌ప్ప‌టికే విభిన్న సంస్కృతుల ప్రజలతో మినీ భారత్‌ను తలపిస్తున్న విశాఖ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీంతో అక్క‌డ అభివృద్ధి కోసం ప్ర‌త్యేకంగా మెట్రోపాలిట‌న్ క‌ల్చ‌ర్ కోసం శ్ర‌మించాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. దేశంలోని మిగ‌తా న‌గ‌రాల‌తో పోలిస్తే రాజ‌ధానిని తీర్చిదిద్ద‌డానికి ఇబ్బంది ఉండ‌దు.

ఇప్ప‌టికే జ‌గ‌న్ మ్యాప్ రెడీ
ఇక మౌళిక స‌దుపాయాల ప‌రంగా చూస్తే విశాఖ‌కు రోడ్డు, రైలు, విమాన‌యాన‌, నౌకాయ‌న స‌దుపాయం ఉండ‌టం అత్యంత క‌లిసివ‌చ్చే అంశం. వ‌న‌రుల ప‌రంగా కూడా విశాఖ జిల్లా ప్ర‌తిష్టాత్మ‌క స్థితిలోనే ఉంది. ఇప్ప‌టికే ఏపీ సీఎం జ‌గ‌న్ కేవ‌లం విశాఖ‌కే అభివృద్ధి ప‌రిమితం కాకుండా ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల‌ను ప్ర‌గ‌తి ప‌థంలోకి తీసుకుపోయే ప్ర‌ణాళిక ర‌చించార‌ని స‌మాచారం. కాబ‌ట్టి ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు కార్య‌నిర్వాహ‌క రాజ‌ధానికి, వైఎస్ఆర్‌సీపీ ప్ర‌భుత్వానికి జై కొట్ట‌డం ఖాయం.

టీడీపీ బాధ ఇదేనా?

మ‌రోవైపు ఇంకో కొత్త వాద‌న సైతం ఈ సంద‌ర్భంగా తెర‌మీద‌కు వ‌స్తోంది. ఉత్తరాంధ్ర టీడీపీ అడ్డా అంటూ చెప్పకోవడం మినహా చేసింది ఏమీ లేదనే భావ‌న ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. పెట్టుబడుల సదస్సుల పేరుతో చేసిన వందల కోట్ల ఖర్చులో సగం కూడా పెట్టుబడులు రాష్ట్రానికి రాలేదు. అందులో విశాఖ‌కు ద‌క్కిన‌వి అతి త‌క్కువ‌. దీంతో సహ‌జంగానే ఇక్క‌డి ప్ర‌జల్లో అసంతృప్తి ఉంది. ఏపీ సీఎం జ‌గ‌న్ ప‌క్కా ప్లానింగ్‌తో ముందుకు వెళితే ఆ నిరాశ దూర‌మ‌వ‌డం ఖాయం. విశాఖలో మెట్రో, ట్రామ్‌ కారిడార్ల ఏర్పాటుతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు ఇప్ప‌టికే జ‌గ‌న్ శ్రీకారం చుట్టారు. పెట్టుబడులను ఆకర్షించడానికి కూడా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇవ‌న్నీ స‌ఫ‌లీకృతం అయితే ఉత్త‌రాంధ్ర‌లో అమాంతం పెరిగిపోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.

కేంద్రం కూడా ఓకే అనేసిందిగా!
ఇదిలాఉండ‌గా, ఇప్ప‌టికే ప‌లు సంద‌ర్భాల్లో ఏపీలో మూడు రాజ‌ధానుల‌పై త‌న వైఖ‌రిని స్ప‌ష్టం చేసిన కేంద్రం ప్ర‌భుత్వం.. మ‌రోసారి.. క్లారిటీ ఇచ్చింది. రాజధాని అంశం మా పరిధిలో లేదంటూ కేంద్ర స‌ర్కార్ తేల్చేసింది. హైకోర్టు ఇచ్చిన నోటీసులపై మరోసారి స్పందించింది కేంద్రం.. సీఆర్డీఏ చట్టం రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులపై హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధానుల‌ను నిర్ణయించుకునే హక్కు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అంశం అని పేర్కొన్న కేంద్రం.. ఇదే అంశాన్ని మ‌ళ్లీ ఏపీ హైకోర్టుకు తెలియజేసింది. రాజధాని అంశం తమ పరిధిలోకి రాదని స్ప‌ష్టం చేసింది… ఏపీ రాజ‌ధాని అంశంలో జోక్యం చేసుకోబో‌మ‌ని తేల్చిచెప్పింది. దీంతో సీఎం జ‌గ‌న్ త‌న నిర్ణ‌యాన్ని భేషుగ్గా అమ‌లు చేయ‌డ‌మే మిగిలింద‌ని అంటున్నారు.

author avatar
sridhar

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju