NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపిలోని వివిధ వర్గాలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పథకానికి జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. అది ఏమిటంటే..?

ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి నవరత్న పథకాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో తొలి ఏడాదిలోనే 90 శాతం నెరవేర్చారు. సంక్షేమ పథకాల అమలునకు సంబంధించి క్యాలెండర్ ను కూడా విడుదల చేశారు. ప్రధానంగా ఓ ముఖ్యమైన పథకానికి పేరు అయితే మార్చారు. కానీ పథకాన్ని ఇప్పటి వరకూ అమలు చేయలేదు. ప్రభుత్వం ఏర్పాటై మూడేళ్లు అవుతున్నా ఆ పథకాన్ని ప్రారంభించకపోవడంతో ఆ పథకానికి మంగళం పాడినట్లేనని అందరూ అనుకున్నారు. అయితే తాజాగా ప్రభుత్వం ఆ పథకాన్ని అక్టోబర్ 1వ తేదీ నుండి అమలు చేయాలని నిర్ణయానికి వచ్చింది. అదే వైఎస్ఆర్ కళ్యాణ మస్తు. షాదీ తోఫా పథకాలు.

AP CM YS Jagan YSR Pelli Kanuka

రాష్ట్రంలో దారిద్ర రేఖకు దిగువను ఉన్న వివిధ పేద వర్గాలకు చెందిన వారు వివాహాలు చేసుకుంటే ప్రభుత్వం గతం నుండి వధూవరులకు ఆర్థిక సహాయం ఇస్తుండేది. గత ప్రభుత్వ హయాంలో చంద్రన్న పెళ్లి కానుకగా అమలు చేయగా , వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ఆర్ పెళ్లి కానుకగా దానికి పేరు మార్పుచేశారు. దీనికి సంబంధించిన వెబ్ సైట్ లో పేరు మార్పు చేశారు గానీ వివాహాలు చేసుకున్న నూతన వధువరులకు ప్రభుత్వం నుండి నిధులు మాత్రం విడుదల కాలేదు. సార్వత్రిక ఎన్నికలకు ముందు పెళ్లి చేసుకున్న వారికి గానీ ఆ తరువాత ఈ మూడేళ్లలో వివాహాలు చేసుకున్న వారికి గానీ ప్రభుత్వం నుండి ఒక్క రూపాయ కూడా విడుదల కాలేదు. రాష్ట్రంలోని పేద వర్గాల వారు పెళ్లి కానుక పునరుద్దరణ కోసం ఎదురు చూపులు చూస్తున్నారు.

YSR Pelli Kanuka

కేటగిరిల వారీగా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు చెందిన వారికి లక్ష రూపాయలు, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు చెందిన కులాంతర వివాహాలు చేసుకుంటే లక్షా 20వేలు, బీసీ వర్గాలకు చెందిన రూ.50వేలు, కులాంతర బీసీ వివాహాలకు రూ.75లు, మైనార్టీలకు లక్ష రూపాయలు, అంగవైకల్యం చెందిన వారికి లక్షా 50వేలు, కూలీల పిల్లలకు లక్ష రూపాయల వరకూ ఆర్థిక సహాయాన్ని పెంపుదల చేస్తూ వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం గతంలోనే నిర్ణయంచింది. గతంలో ఉన్న ఆర్థిక సహాయాన్ని కొంత మేర అయితే పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు గానీ మూడేళ్లుగా ఈ పథకాన్ని కొనసాగించలేదు. అయితే ప్రభుత్వం సంక్షేమ పథకాల క్యాలెండర్ లో జగనన్న వసతి దీవెన, విద్యాదీవెన, రైతులకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ రబీ, డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ ఉచిత పంటల భీమా, రైతు భరోసా, మత్స్యకార భరోసా, జగనన్న విద్యాకానుక, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ వాహన మిత్ర, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న తోడు, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ఇలా పథకాలతో ఏప్రిల్ నుండి ఫ్రిబవరి వరకూ ప్రకటించి అమలు చేస్తొంది.

వీటిలో వైఎస్ఆర్ పెళ్లి కానుకను చేర్చకపోవడంతో జగనన్న ఈ పథకానికి మంగళం పాడారా అన్న అనుమానం ప్రజల్లో నెలకొంది. ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యేలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో తిరుగుతుండగా ప్రజల నుండి ఈ పథకంపై ప్రశ్నిస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి .. వైఎస్ఆర్ పెళ్లి కానుక,. షాదీ తోఫా పథకాల అమలుపై క్లారిటీ ఇచ్చేశారు. సీఎం జగన్ ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం శనివారం రాత్రి ఈ పథకం అమలునకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకాన్ని అక్టోబర్ 1 నుండి అమలు చేయనున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది.

Reag More: ఆ విభాగాల విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం

 

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N