పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హాస్పిటల్లో దర్శనమిచ్చారు. ఇందుకు సంబంధించి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. అయితే ప్రభాస్ ఎందుకు హాస్పిటిల్ కు వెళ్లారు..? ఆయనకు ఏమైంది..? వంటి విషయాలు ఏమీ బయటకు రాలేదు. అసలు ఆయన ఏ హాస్పిటల్కి వెళ్లారో కూడా తెలియదు
కానీ, ప్రభాస్ ఓ హాస్పిటల్లోని ఐసీయూ నుంచి నడుచుకుంటూ వెళ్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుండటంతో.. ఆయనకు ఏమైందో తెలియక అభిమానులు అమోమయంలో పడిపోయారు. కొంతకాలంగా ప్రభాస్ మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. ఈ మధ్యనే సర్జెరీ కోసం విదేశాలకు వెళ్ళొచ్చారు.
ఇప్పుడు మళ్లీ అదే గాయం ఆయన్ని ఇబ్బంది పెడుతుందని, అందుకే హాస్పిటల్కి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు కృష్ణంరాజు ఆరోగ్యం బాగోలేదని, ఆయన్ను హాస్పిటలో పెట్టి ఉంటారని.. అందుకే ప్రభాస్ పెదనాన్నను చూడటానికి వెళ్లారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే వీటిపై ఎలాంటి స్పష్టత లేదు. కాగా, ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `సలార్`, ఓం రౌత్ డైరెక్షన్లో `ఆదిపురుష్`, నాగ్ అశ్విత్తో `ప్రాజెక్ట్ కె` చిత్రాలు చేస్తున్నాడు.
వీటిలో ఆదిపురుష్ షూటింగ్ ఇప్పటికే పూర్తి అవగా.. మిగిలిన రెండు చిత్రాలు సెట్స్ మీదే ఉన్నాయి. ఇవి పూర్తైన వెంటనే ప్రభాస్ సందీప్ రెడ్డి వంగాతో `స్పిరిట్` అనే మూవీ చేయబోతున్నాడు.
#Prabhas Anna spotted at hospital.His swag 🔥🙏 pic.twitter.com/bk4i2rqduK
— SALAAR – the monster (@NawinMoto) September 10, 2022
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!