NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

అయినా పోయి రావలె హస్తినకు… జగన్ జంజాటం

 

ఉన్నట్టుండి అప్పటికి అప్పుడు పోలవరం ప్రాజెక్ట్ పర్యటన…. వెనువెంటనే ఢిల్లీ నుంచి ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు పిలుపు.. ఢిల్లీ పెద్దలతో వరుసగా అప్పోయింట్మెంట్… ఎందుకు ఆకస్మిక పర్యటనలు.. ఎందుకు ఢిల్లీ పెద్దలు పిలుస్తున్నారు. అంత అర్జెంటు గా జగన్ తో మాట్లాడే పని ఏమొచ్చింది..?? అంతా “సమ్ థింగ్ ఇస్ ఫిషింగ్ “

ఢిల్లీలో పెద్ద ఎత్తున రైతు ఉద్యమం జరుగుతోంది. వ్యవసాయ శాఖ మంత్రి నరేష్ సింగ్ తోమర్ రైతు నాయకులతో చర్చలు జరుపుతున్న దాంట్లో స్పష్టత కొరవడింది. మరోపక్క బిజెపి పెద్దలంతా వచ్చే తమిళనాడు పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై దృష్టి పెట్టారు. ఇక ప్రభుత్వంలోని కీలక మంత్రులంతా రైతు జూన్ సరిహద్దు సమస్య లతో బిజీగా ఉన్నారు. మరి ఇంత కీలక సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో కేంద్రం పెద్దలకు బిజెపి నాయకులకు ఏం పని వచ్చిపడింది?? ఇంత బిజీ సమయంలో జగన్ మోహన్ రెడ్డి తో మాట్లాడే విషయాలు ఏంటి? ఒకపక్క రాష్ట్రంలో బిజెపి నాయకులు వైఎస్సార్సీపీతో కయ్యం పెట్టుకుంటున్న మరోపక్క కేంద్రం పెద్దలు జగన్ను దగ్గరకు తీసుకుని అపాయింట్మెంట్లు ఇవ్వడం వెనుక అసలు రహస్యం ఏమిటి అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.
** విశ్వసనీయ సమాచారం మేరకు జగన్ ఢిల్లీ పర్యటన వెనుక కీలక విషయం ఒకటి ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. రాజ్యాంగ వ్యవస్థలు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషనర్ చేయాల్సిన విధులను తాను చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడం రాజ్యాంగ సంక్షోభానికి దారి తీసే ప్రమాదం ఉంది. ఫిబ్రవరి లో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భావించి దానికి తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం…. కరోనా సెకండ్ వెవ్ దృష్ట్యా ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించడం సరి కాదని రాష్ట్ర ప్రభుత్వం వాదన. దీనిపై ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం ఇప్పుడు కేంద్రం దృష్టికి వెళ్లింది.
** ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలని అది ఎలా నిర్వహించాలి అన్నది ఎన్నికల కమిషన్ విధి. లోక్సభ అసెంబ్లీ స్థానాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆయా సమయాలను తేదీలను బట్టి ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్ర పరిధిలోని ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థలను నిర్వహిస్తోంది.
** ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి ఎలా సన్నద్ధమవ్వాలి అన్న విషయాలన్నీ ఎన్నికల కమిషన్ విధుల్లో ఉంటాయి. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల కమిషన్ కు స్వయంప్రతిపత్తి ఉంటుంది. కాలపరిమితి ముగిసిన వెంటనే ఎన్నికలు నిర్వహించడం ఎన్నికల కమిషన్ ప్రధాన కర్తవ్యం.
** దీనిపై జగన్ ఏకంగా శాసనసభలో తీర్మానం చేయించడం, దానికి కట్టుబడి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చేస్తున్న విజ్ఞప్తులను తోసిపుచ్చడం కేంద్రం సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు నిర్వహించవద్దని అంటూ తీర్మానం చేయడం అనైతికం. కాలపరిమితి ముగిసిన వెంటనే ప్రజాస్వామ్య దేశంలో కచ్చితంగా ఎన్నికలు జరగాలి. అలా కాకుండా ఎన్నికలు నిర్వహించవద్దని తీర్మానాలు చేసి కాలపరిమితి పొడిగించుకునే హక్కు పాలక పార్టీల పాలకపక్షానికి ఉండదు.


** ఆంధ్రప్రదేశ్ పరిణామాలు రాజ్యాంగ సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉందని కేంద్రం గుర్తించింది. ఎన్నికల కమిషనర్ విధులు రాష్ట్ర ప్రభుత్వం ఆటంకం కలిగిస్తుందనే అంశం కేంద్ర ప్రభుత్వం కీలకమైన నాయకులు జగన్ తో మాట్లాడేందుకే ఢిల్లీకి రమ్మన్నట్లు సమాచారం. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న తరుణంలో దానికి తగిన ఏర్పాట్లు అప్పటికప్పుడు సాధ్యం కావు. దీంతో ఇది పెద్ద అంశం అయ్యేలా కాకుండా కేంద్రం పెద్దలు జగన్ తో మాట్లాడే అవకాశం ఉంది.
** ఇక రెండో విషయం వస్తే జస్టిస్ ఎన్వి రమణ విషయంలో బిజెపి జగన్ బాణాన్ని ఎక్కు పెట్టింది. జగన్ భుజాలపై తుపాకీ ఉంచి కాల్చేలా ప్రణాళిక వేస్తోంది. చంద్రబాబుకు సన్నిహితుడిగా పేరొందిన ఎన్.వి.రమణ త్వరలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యేందుకు బిజెపి అంత ఇష్టం చూపడం లేదు. తమకు అనుకూలమైన వారిని, కావలసిన వారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా చూడాలని బీజేపీ ఆశ. అయితే జడ్చర్ల కొలీజియం ప్రకారం సీనియారిటీ జాబితాలో ఎన్.వి.రమణ తరువాత ప్రధాన న్యాయమూర్తి అయ్యేందుకు వీలుంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎన్.వి.రమణ విషయాలపై ఆయన మీద ఉన్న ఆరోపణలపై దాన్ని ఎలా ప్రాజెక్ట్ చేసి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి హోదాను విరమణకు దక్కకుండా ఆపేందుకు బీజేపీ పెద్దలు జగన్ తో మాట్లాడేందుకు సైతం ఢిల్లీకి ప్రేమ ఉన్నట్లు తెలుస్తోంది.
** ఢిల్లీ పిలుపు ముందుగానే తెలిసిన ముఖ్యమంత్రి జగన్ దీనికి అనుగుణంగా పోలవరం పర్యటన అప్పటికప్పుడు ఖరారు చేసుకున్నారు. 2022 ఖరీఫ్ నాటికి పోలవరం గ్రావిటీ ద్వారా నీళ్లు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేయాలని దానికి అనుగుణంగా పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో పోలవరం నిధులు, 2018 19 అంచనాల మేరకు నిధులు ఇచ్చేలా కేంద్రంతో మాట్లాడేందుకు ఢిల్లీ వచ్చినట్లు జగన్ కలరింగ్ ఇచ్చుకోవడానికి పోలవరం పర్యటన అప్పటికప్పుడు పెట్టుకున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రధానంగా ఈ రెండు అంశాలను, చర్చించేందుకే జగన్ ఢిల్లీకి వెళ్తున్నట్లు చెబుతున్న ఇంకా ప్రత్యేకమైన కారణాలు ఉండొచ్చని తెలుస్తోంది.

author avatar
Special Bureau

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju