NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Janasena: కూటమి ప్రభుత్వంలో మూడింట ఒక వంతు పదవులు అంటూ..జనసైనికులకు పవన్ హామీ

Pawan Kalyan made a key statement on alliances

Janasena: జనసేన కోసం తపించి పని చేసిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం కల్పించే బాధ్యత తీసుకుంటానని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. సోమవారం విశాఖలో ఉమ్మడి జిల్లాల నాయకులతో ముఖాముఖి భేటీలు నిర్వహించారు. వీరమహిళల విభాగం ప్రాంతీయ సమన్వయకర్తలతో సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..రాష్ట్రంలో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారనీ.. మన కూటమి అధికారంలోకి వస్తొందని అన్నారు. క్షేత్ర స్థాయి నుండి మన బలాన్ని సద్వినియోగపర్చుకొంటూ కూటమిని గెలుపు దిశగా తీసుకువెళ్లేందుకు ప్రణాళికంగా వ్యవహరించాలని అన్నారు.

Pawan Kalyan made a key statement on alliances
Pawan Kalyan

వ్యక్తిగతంగా నా గెలుపు గురించి కాదనీ, సమిష్టి గెలుపు కోసమే తొలి నుండి నా వ్యూహం, అడుగులు ఉంటున్నాయని తెలిపారు. 2019 తర్వాత పార్టీ బలంగా నిలిచేందుకు దోహదపడ్డ నాయకులకు అండగా ఉంటానని చెప్పారు. ప్రజారాజ్యం సమయంలో ఉన్న ఒక చిన్న పరిచయంతో ఒక నాయకుడికి 2014 తర్వాత టీటీడీ సభ్యుడిగా రెండు పర్యాయాలు పదవి ఇప్పించగలిగాననీ, అప్పటికి ఆయన మన పార్టీలోకి రాలేదని ఉహదరిస్తూ .. జనసేన కోసం నిలిచిన ఎవర్నీ విస్మరించేది లేదని అన్నారు. ఇప్పటి ఎన్నికల్లో స్థానాలు మాత్రమే కాకుండా, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వచ్చే అవకాశాలనూ దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు. పీఏసీఎస్ ల్లో, ఇతర కీలక నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానాలు దక్కుతాయని అన్నారు. తద్వారా అందరినీ బలోపేతం చేసి ముందుకు వెళ్దామని తెలిపారు. మూడింట ఒక వంతు పదవులు దక్కించుకుందామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుస్థిర పాలన అవసరమని, అప్పుడే అభివృద్ధి సాధ్యమని, అలాంటి సుస్ధిర పాలన మన కూటమి అందించగలదని ఆర్ధిక నిపుణులు, పారిశ్రామిక వేత్తలు స్పష్టంగా చెబుతున్నారని తెలిపారు. ఇటీవల తనను కలిసిన పారిశ్రామిక వేత్తలు చెప్పిన విషయాలను ఈ సందర్భంగా పంచుకున్నారు. పార్టీ బలోపేతం.. పార్టీ పక్షాన ఎన్నికల నిర్వహణ కోసం రూ.10కోట్లు తన స్వార్ధితాన్ని నిధిగా ఇవ్వనున్నట్లు ఈ సమావేశంలో ప్రకటించారు.

కాగా, ఆదివారం రాత్రి విశాఖకు చేరుకున్న పవన్ కళ్యాణ్ తొలుత మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు వారిద్దరు పార్టీ కార్యక్రమాలు, ఎన్నికల్లో అనుసరించే విధానాలపై చర్చించారు. అనంతరం విశాఖపట్నం, అనకాపల్లి నియోజకవర్గాలకు చెందిన పార్టీ ముఖ్యనేతలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు తదితరులు పాల్గొన్నారు.

BRS: బీఆర్ఎస్ కు బిగ్ షాక్ .. చేజారిన జవహర్‌నగర్ కార్పోరేషన్

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju