జాతీయం ట్రెండింగ్ న్యూస్

జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాలు విడుదల చేసిన ముంబాయి ఐఐటీ .. ఫలితాలను తెలుసుకోండి ఇలా

Share

జేఈఈ అడ్వాన్స్ డ్ – 2022 ఫలితాలను పరీక్షల నిర్వహణ సంస్థ ఐఐటీ (ముంబాయి) ఈ రోజు ప్రకటించింది. రిజల్స్ తో పాటే తుది ఆన్సర్ కీ, మెరిట్ లిస్ట్ ను రిలీజ్ చేసింది. ఫలితాల్లో ఏపి (విజయవాడ)కు చెందిన పోలిశెట్టి కార్తికేయ ఆరవ ర్యాంక్ సాధించింది. అభ్యర్ధులు స్కోర్ కార్డును jeeadv.ac.in వైబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఫలితాలను రిజర్వేషన్ల వారీగా ఆయా వర్గాల కోట్ ప్రకారం రిలీజ్ చేసినట్లు చెప్పింది.

JEE Advanced 2022 Result Declared

 

జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాలు విడుదల అయిన నేపథ్యంలో జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) సీట్ల కేటాయింపు కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఈ నెల 12వ తేదీ నుండి జోసా రిజర్వేషన్లు ప్రారంభం అవుతాయి. అడ్వాన్స్ డ్ లో అర్హత సాధించిన విద్యార్ధులు ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ, జేఎఫ్టీఇలలో మెరిట్, రిజర్వేషన్ల అధారంగా ప్రవేశాలు లభించనున్నాయి. 23 ఐఐటీలలో 16,598 సీట్లు, 31 ఎన్ఐటీలో 23,994, 26 ఐఐఐటీలలో 7,126, 33 జీఏఫ్టీఐలలో 6,759 సీట్లు ఈ సారి భర్తీకి అందుబాటులో ఉన్నట్లుగా జోసా సీట్ల వివరాలను విడుదల చేసింది. వాటిలోనే మహిళలకు సూపర్ న్యూమరరీ కోటా కూడా అమలు కానుంది. కాగా ఆర్కిటెక్చర్ కోర్సులకు సంబంధించి అభ్యర్ధులు 11,12 తేదీల్లో రిజిస్ట్రేషన్ లు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 14న ఏఏటీ పరీక్షను నిర్వహించి 17న ఫలితాలను విడుదల చేయనున్నారు.


Share

Related posts

తిరిగి సీటులో  అలోక్‌వర్మ ‌

somaraju sharma

బిగ్ బాస్ 4: అన్ని సీజన్ల కంటెస్టెంట్ ల కంటే అతనే హైలెట్ అంటున్న జనాలు ..!!

sekhar

Chiranjeevi Acharya : మెగా స్టార్ ఫ్యాన్స్ పంట పండింది, ఆచార్య కోసం కొరటాల ఎవరిని తీసుకొచ్చాడో చూడండి !

arun kanna