Jeevitha rajasekhar: ఇండస్ట్రీలో ప్రముఖుల ఆస్తుల గురించి సోషల్ మీడియాలో వార్తలు ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటాయి అన్న సంగతి తెలిసిందే. ఈ రీతిగా నే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జీవిత రాజశేఖర్ ప్రాపర్టీ దాదాపు 200 కోట్లు కొనుగోలు చేయడానికి .. మెగా కోడలు ఉపాసన రెడీ అవుతున్నట్లు.. వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఫిలిం సర్కిల్ లో ఈ ఆస్తులు ఉన్నట్లు దీన్ని ఎక్కడ అమ్మేసి వేరే చోట మరొక ఆస్తి కొనుగోలు చేసే ఆలోచనలో జీవిత-రాజశేఖర్ ఉన్నట్లు ఆ వార్తల సారాంశం.
ప్రస్తుతం “మా” ఎన్నికలు జరుగుతున్న తరుణంలో.. ఇండస్ట్రీలో ఎన్నికల వాతావరణం వాడి వేడిగా ఉన్న క్రమంలో.. ఇటువంటి వార్తలు రావడంతో సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మా అధ్యక్ష పదవికి జీవిత రాజశేఖర్ పోటీ చేయడం మరో పక్క మెగా కాంపౌండ్.. అధ్యక్ష పదవి రేసులో ఉన్న ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేస్తూ ఉండటం తో జీవిత రాజశేఖర్ ఆస్తులు ఉపాసన కొనుగోలు చేస్తున్నట్లు వార్తలు రావడం సంచలనంగా మారింది.
Read more: MAA: “మా” అధ్యక్ష పదవి రేసులో విషయంలో ప్రకాష్ రాజ్.. విష్ణు తో పోటీకి మరో వ్యక్తి..??
మరోపక్క మా అధ్యక్ష ఎన్నికలు లో అధ్యక్ష పదవి కోసం ఏకంగా నలుగురు పోటీ చేయటం.. ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఇప్పటివరకు మా అధ్యక్ష ఎన్నికలకు కేవలం ఇద్దరు మాత్రమే పోటీదారులుగా ఉండేవారు. ఈ క్రమంలో ఇండస్ట్రీలో పెద్దగా విభేదాలు ఒకరి మధ్య ఒకరకి ఉండేవికావు. కానీ ఈ సారి ఏకంగా నలుగురు పోటీ చేస్తూ ఉండటంతోపాటు ఇండస్ట్రీలో .. గ్రూపులో ఏర్పడుతున్నట్లు మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎన్నో ఏళ్ళనుండి.. తెలుగు సినిమాలు చేస్తూ హైదరాబాదులోనే స్థిరనివాసం ఏర్పరుచుకుని మరోపక్క… తెలంగాణలో కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని వాటిని అభివృద్ధి చేస్తూ ఉన్న పోటీదారుడు ప్రకాష్ రాజ్.. కర్ణాటక ప్రాంతానికి చెందిన వాడని నాన్ లోకల్ అంటూ సరికొత్త వివాదం ప్రత్యర్థులు తెరపైకి తీసుకు రావడంతో.. ఇండస్ట్రీలో మా ఎన్నికల వాతావరణం నువ్వానేనా అన్నట్టుగా నెలకొంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!