NewsOrbit
న్యూస్

Karthika Deepam Mar 18 Today Episode: హిమను చుసిన సౌందర్య… తనను ఇంటికి తీసుకుని వెళ్తుందా… మరి సౌర్యను ఎలా పేస్ చేస్తుందో..?

Karthika Deepam Mar 18 Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకధారణ పొందుతు వస్తుంది. గత ఎపిసోడ్ లో హిమను తీసుకుని ఇంద్రుడు, చంద్రమ్మ దంపతులు హోటల్ కు తీసుకుని వెళ్తారు. పాపం బిల్ కట్టడానికి డబ్బులు లేక దొంగతనం చేయడానికి బయటకు వెళ్తారు. హిమను ఒక్కదాన్నే హోటల్లో వదిలేసి వెళ్తారు. మరోపక్క సౌందర్య కూతురు దగ్గరకు వెళ్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందో తెలుసుకుందామా..!

Karthika Deepam Mar17 Today Episode: రెస్టారెంట్ లో హిమ జీవితం ఊహించని మలుపు తిరగనుందా..కొంపతీసి దొంగలా మారదు కదా..!

Karthika Deepam Mar 18 Today Episode: హిమను రెస్టారెంట్ లో వదిలేసి వెళ్లిన ఇంద్రుడు,చంద్రమ్మ దంపతులు :

ఈరోజు ఎపిసోడ్ లో హిమా ఒక రెస్టారెంట్ లో కూర్చుని తింటుంటుంది. అయితే చంద్రుడు, ఇంద్రమ్మ ఇద్దరి కోసం చాలా సేపు వెయిట్ చేస్తుంటుంది. ఇక మరోవైపు సౌందర్య కూతురు స్వప్నను,అల్లుడిని కలపడానికి చాలా ప్రయత్నిస్తుంది. కానీ స్వప్న మాత్రం సౌందర్య మాటలు అసలు వినదు.ఏదేదో మాట్లాడి బాధ పెడుతుంది. అయినా నా జీవితం నా ఇష్టం మీరు మధ్యలో దూరవద్దు అంటుంది. అప్పుడే అత్తయ్య అంటూ అల్లుడు పిలవగానే.. అల్లుడుగారు మీరు అత్తయ్య అంటుంటే నాకు దీపనే గుర్తొస్తుంది.. అని బాధ పడుతుంది. ఇక అప్పుడే స్వప్నతో మాట్లాడుతూ ఒకప్పుడు మన కుటుంబాన్ని చూసి అందరూ ఆనందపడేవారు. కానీ ఎవరి శాపం తగిలిందో ఏమైందో తెలియదు గాని ఇలా చెట్టుకు ఒకళ్ళం, పుట్టకు ఒకళ్ళం లాగా అయిపోయాం అంటుంది.

సౌందర్యను అవమానించిన స్వప్న :

దీప, కార్తీక్, హిమా అలా అయిపోయారు. మీరు ఇలా అయిపోయారు అని బాధపడుతుంది. మీరు పిల్లలని పంచుకున్నారు.తండ్రి దగ్గర ఒకరు, తల్లి దగ్గర ఒకరు అని. ఇక ఇంట్లో ఉన్న ఆదిత్య, శ్రావ్య అమెరికా వెళ్ళిపోతాం అంటున్నారు. మీరు అయిన కలిసిపోండి స్వప్న అందరం కలిసి ఒకచోటనే ఉందాం అంటుంది. దీంతో స్వప్న సీరియస్ అయ్యి మా లైఫ్ లో ఇన్వాల్వ్ అవ్వకండి అంటుంది.నాకు ఏ సలహాలు వద్దు, బంధాలు, చుట్టరికాలు అసలే వద్దు అని వాళ్ళని వెళ్లిపొమ్మని చెప్తుంది. ఇక సౌందర్య మాత్రం అల్లుడుకు క్షమాపణలు చెప్పి తప్పు చేశాను అని అక్కడ నుంచి బయలుదేరి బయటకు వస్తుంది.అప్పుడే స్వప్న పిల్లలు అయిన ప్రేమ్ నిరూపమ్ లను చూస్తుంది. ఇక అందులో ఒకరు హిమతో నాకు అంత పరిచయం లేకపోయినా ఎప్పుడో ఒకసారి వీడియో కాల్ చేశాను. ఎందుకో తనని చూస్తే నా బెస్ట్ ఫ్రెండ్ లాగా అనిపిస్తుంది అని చెప్తాడు. అప్పుడే వాళ్ళ ఇద్దరినీ ఇంటికి తీసుకెళ్తా అని తీసుకెళ్తుంది సౌందర్య

Karthika Deepam Mar 15 Today Episode: సీరియల్ నుంచి మోనిత కూడా అవుట్..!?
పోలీసులకు చిక్కిన ఇంద్రుడు,చంద్రమ్మ :

ఇక సీన్ కట్ చేస్తే డబ్బుల కోసం అని చంద్రమ్మ, ఇంధ్రుడు డబ్బు కొట్టేస్తూ పోలీసులకు పట్టుబడుతారు. దీంతో వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఇక హిమ మాత్రం రెస్టారెంట్ లోనే ఉండిపోయి వాళ్ల కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక వెయిటర్ వచ్చి నువ్వు వేళ్ళు అమ్మ అంటూ ఈ బిల్ నేను కట్టుకుంటా అని హిమను అక్కడ నుండి పంపిస్తాడు. ఇంటికి వేళ్ళు అమ్మ అంటే నేను వెళ్ళలేను అని మనసులో అనుకుంటుంది.

హిమను చుసిన సౌందర్య:

రోడ్డుపై అనాధగా నడుస్తూ వెళ్తు హిమ మంచినీళ్లు తాగనా అని ఒక షాప్ యజమానిని అడుగుతుంది సరే తాగమ్మ అంటె తాగుతుంటుంది. ఇంతలో కారులో వెళ్తున్న నిరూపమ్ హిమను చూసి సౌందర్యకు చెప్పి కారు ఆపించి అక్కడికి తీసుకెళ్తాడు. సౌందర్య కారు ఆపి హిమా మంచినీళ్లు తాగిన షాప్ దగ్గరకు వెళ్ళేలోపు అక్కడ హిమ ఉండదు. షాప్ అతనికి హిమ ఫోటో చూపించి ఈ పాపనేనా మీరు చూసింది అని అడుగుతుంది అవును అంటాడు షాప్ యజమాని. ఇక హిమ కారు కింద పడిపోతు యాక్సిడెంట్ అయ్యే సమయానికి సౌందర్య వచ్చి కాపాడుతుంది.సౌందర్యను చూసి హిమ ఆనందంతో కౌగలించుకుంటుంది.ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Related posts

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju