నిత్యం వివాదాలతో సహవాసం చేసే కత్తి మహేష్ అరెస్ట్ అయ్యారు అయ్యారు. సినీ విమర్శకుడు కత్తి మహేష్ శ్రీరాముడిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారు. దీంతో ఆయనపై పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు మహేష్ ను అదుపులోకి తీసుకున్నారు.
మొదట ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. ఫిబ్రవరిలో కత్తి మహేష్ శ్రీరాముని కించపరిచేలా కొన్ని వ్యాఖ్యలు చేసారు. ఆయనపై నమోదైన కేసుల ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు పలుమార్లు విచారించారు. ఇవాళ మరోసారి విచారించి మహేష్ ను అదుపులోకి తీసుకున్నారు. మహేష్ ఈ సందర్భంగా ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. ఈ దేశంలో ఒక మనిషి ప్రాణం కన్నా మతానికే విలువిస్తారని పేర్కొన్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!