Keeravani: ఆ స్టార్ డైరెక్టర్స్ సక్సెస్‌లో కీరవాణికి వాటా ఉంటుంది

Share

Keeravani: తెలుగు చిత్ర పరిశ్రమలో ఎం.ఎం. కీరవాణి గా, తమిళంలో మరకతమణిగా, బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎం.ఎం.క్రీమ్ గా కీరవాణి తన సత్తా చాటుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఉషా కిరణ్ మూవీస్ 1989లో నిర్మించిన మనసు – మమత సినిమాతో ఎం.ఎం.కీరవాణి పేరుతో సంగీత దర్శకుడుగా వెండితెరకు పరిచయమయ్యాడు. మొదటిగా అవకాశం ఇచ్చిన ఉషా కిరణ్ మూవీస్ సంస్థలోనే వరుసగా పీపుల్స్ ఎన్ కౌంటర్, అమ్మ, అశ్విని లాంటి సినిమాలకు సంగీతం అందించారు. అదే సమయంలో సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ అవకాశం ఇచ్చారు. విక్టరీ వెంకటేశ్ – శ్రీదేవీ నటించిన బ్లాక్ బస్టర్ క్షణక్షణం ఆయనకు టాలీవుడ్ లో మంచి బ్రేక్ ఇచ్చింది.

keeravani part is in star directors success
keeravani part is in star directors success

కీరవాణి సంగీతం అందించిన ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, ఘరాన మొగుడు, సీతా రామయ్యగారి మనవరాలు, ఘరానాబుల్లోడు వంటి సినిమాలు మ్యూజిక్ పరంగా మంచి విజయాన్ని అందుకున్నాయి. ఆయన సంగీతం అందించిన ప్రతీ సినిమా ఆడియోపరంగా సక్సెస్ అయి సినిమాలు సూపర్ హిట్ సాధించడానికి ముఖ్య కారణం అయ్యాయి. దాంతో ప్రముఖ దర్శకులు, హీరోలు తమ సినిమాలకి సంగీత దర్శకుడిగా కీరవాణి కావాలని పట్టు పట్టేవారు. కీరవాణి రాజమౌళితో పనిచేయడానికి ముందు ఎక్కువగా అసోసియేట్ అయింది దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుతో. ఆయనతో చేసిన అన్నమయ్య సినిమాలో పాటలు, అన్నమయ్య కీర్తనలు ఇప్పటికీ అలరిస్తున్నాయి.

Keeravani: రాఘవేంద్ర రావు, రాజమౌళి సక్సెస్ లో కీరవాణికి తప్పకుండా వాటా

ఈ సినిమానే కాదు శ్రీరామదాసు, శిరిడి సాయి లాంటి భక్తి ప్రధానంగా రూపొందిన సినిమాలకి కీరవాణి సంగీతం ప్రధాన పాత్ర పోషించింది. దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు – కీరవాణి కాంబినేషన్ లో 25 వ సినిమాగా రావడం గొప్ప విశేషం. ఈ 25 సినిమాలు మ్యూజికల్ హిట్సే. వీటిలో మేజర్ చంద్ర కాంత్, అల్లరి మొగుడు, అల్లరి బుల్లోడు, అన్నమయ్య, శ్రీరామదాసు, పెళ్ళి సందడి ఘరాన మొగుడు లాంటి సినిమాలున్నాయి. ఘరాన మొగుడులోని ప్రతీ పాట మాస్ ఆడియన్స్ ని ఊపేసింది. చిరంజీవి కెరీర్ లో ఘరాన మొగుడు ఆడియో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.

నిజ జీవితంలో బంధువులైన దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి – కీరవాణిల మధ్య సినిమాల పరంగా స్టూడెంట్ నంబర్ వన్ నుంచి ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. రాజమౌళి సినిమా భారీ విజయాన్ని అందుకోవడంలో కీరవాణి పాత్ర ఎంతో ప్రధాన పాత్ర పోషిస్తుంది. స్టూడెంట్ నంబర్ 1, ఛత్రపతి, సింహాద్రి, యమదొంగ, మగధీర, విక్రమార్కుడు, మర్యాద రామన్న ఈగ, బాహుబలి ఫ్రాంఛైజీ లకి కీరవాణి సంగీతం హైలెట్ గా నిలిచింది. ఇండస్ట్రీ మొత్తం రాఘవేంద్ర రావు, రాజమౌళి సక్సెస్ లో కీరవాణికి తప్పకుండా వాటా ఉంటుందని చెప్పుకుంటారు. ప్రస్తుతం రాజమౌళి – కీరవాణి కాంబినేషన్ లో పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్ రూపొందుతోంది. ఈ సినిమాకి కీరవాణి హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంటున్నారట.


Share

Related posts

Himanshu: చిన్న వయసులోనే అరుదైన ఘనత సాధించిన సీఎం కేసిఆర్ మనుమడు హిమాన్షు..! అది ఏమిటంటే..?

somaraju sharma

Ayyannapatrudu: అయ్యన్న భలే కవర్ చేసుకున్నారే..!!

somaraju sharma

సుశాంత్ సింగ్ కేసు సి‌బి‌ఐకి ఇచ్చిన 2 గంటల్లోనే కీలక పరిణామం

Varun G