NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: చేరికలపై దృష్టి పెట్టిన వైఎస్ షర్మిల .. నిన్న వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, నేడు మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరిక

YS Sharmila: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల .. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్ధులను బరిలో దింపేందుకు దృష్టి పెట్టారు. ఈ క్రమంలో వైసీపీలో టికెట్ లు దక్కని అసంతృప్తులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారు. టిక్కెట్ హామీ ఇస్తుండటంతో నేతలు పార్టీలో చేరుతున్నారు.

నిన్న కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్ధర్ ను పార్టీలో చేర్చుకున్నారు. వైసీపీ ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో కడప జిల్లాకు చెందిన వైద్యుడు  డాక్టర్ దారా సుధీర్ ను నియోజకవర్గ ఇన్  చార్జిగా నియమించిన వైసీపీ తాజాగా ఆయన అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేసింది. నందికొట్కూరులో వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వర్గం ఆర్ధర్ ను పూర్తి గా వ్యతిరేకిస్తూ వస్తొంది. ఈ క్రమంలో ఆయన వైసీపీని వీడారు. నిన్న వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

congress

తాజాగా ఇవేళ అదే జిల్లాకు చెందిన కోడుమూరు మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన మురళీకృష్ణ 2014 ఎన్నికల్లో ఓటమి పాలైయ్యారు. ఆ తర్వాత 2016 లో  మురళీ కృష్ణ వైసీపీలో చేరారు. అయితే 2019 ఎన్నికలకు ముందు వైసీపీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో టీడీపీలో చేరారు. అయితే వెంటనే అలర్ట్ అయిన జగన్మోహనరెడ్డి 2024 ఎన్నికల్లో తగిన న్యాయం చేస్తానని మురళీకృష్ణను బుజ్జగించడంతో తిరిగి రెండు రోజుల్లోనే వైసీపీలో చేర్చుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మురళీకృష్ణకు టీటీడీ బోర్డు మెంబర్ గా అవకాశం కల్పించారు.

అయితే కోడుమూరు నియోజకవర్గం నుండి వరుసగా 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులు గెలుపొందడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్, మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణతో పాటు ఆరడజను మంది టిక్కెట్ ఆశించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేపై వ్యతిరేకత బాగా ఉండటంతో పార్టీ అధిష్టానం డాక్టర్ ఆదిమూలపు సతీష్ ను అభ్యర్ధిగా ప్రకటించింది. దీంతో మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ కు స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయాలని అనుచరుల నుండి ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలిసింది. అయితే రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలన్న కృతనిశ్చయంతో మురళీ కృష్ణ ఉన్నారు. కాంగ్రెస్ నుండి ప్రతిపాదన రావడంతో వెంటనే షర్మిల తో భేటీ అయ్యారు. ఇవేళ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు.

Shobha Karandlaje: తమిళ ప్రజలకు క్షమాపణలు చెప్పిన కేంద్ర మంత్రి శోభ

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju