లాస్య టాక్స్.. ప్రస్తుతం యూట్యూబ్ లో దూసుకుపోతున్న చానెల్ ఇది. బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ లాస్య హౌస్ నుంచి బయటికి వచ్చాక తనకు ఒక్కసారిగా ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చి పడింది. లాస్య తన పెళ్లికి ముందు యాంకర్ గా చాలాఏళ్లు బుల్లితెరను ఏలింది. ఆ తర్వాత పెళ్లి, పిల్లలు.. బిజీ జీవితం కావడంతో యాంకర్ కెరీర్ ను కొన్నేళ్ల పాటు వదిలేసింది. మళ్లీ బిగ్ బాస్ 4 తో తన సెకండ్ కెరీర్ ను ప్రారంభించింది. ప్రస్తుతానికైతే బుల్లితెర మీద ఈవెంట్స్ చేస్తూ తన యూట్యూబ్ చానెల్ ను మెయిన్ టెన్ చేస్తోంది.
అయితే.. గత రెండు మూడు రోజుల నుంచి లాస్య యూట్యూబ్ చానెల్ పై ఎన్నో వార్తలు వచ్చాయి. తన యూట్యూబ్ చానెల్ హ్యాక్ కు గురయింది. ఆ తర్వాత చానెల్ తిరిగి తన చేతికి వచ్చింది. తన చేతికి తన చానెల్ తిరిగి రాగానే.. లాస్య.. యూట్యూబ్ వీడియోలు చేయడం ప్రారంభించింది.
సంక్రాంతి సందర్భంగా స్టార్ మాలో నిర్వహించిన ఇట్స్ ఏ ఫ్యామిలీ పార్టీ ఈవెంట్ లో లాస్య మెరిసింది. ఆ ఈవెంట్ కోసం తను ఎంత కష్టపడింది.. మేకప్ వేసుకున్నది.. అన్నింటినీ తన కెమెరాలో బంధించి వీడియోను తన యూట్యూబ్ చానెల్ లో అప్ లోడ్ చేసింది. ఇంకెందకు ఆలస్యం.. మీరు కూడా వీడియోను చూసేయండి.