22.7 C
Hyderabad
March 26, 2023
NewsOrbit
Right Side Videos న్యూస్

‘హిట్ సాంగ్స్ రీమిక్స్ అన్యాయం’!

Share

పాత పాటల రీమిక్స్ ట్రెండ్ పట్ల ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల ఆమె చెల్లెలు ఉషా మంగేష్కర్ పాట ఒకదానిని ‘టోటల్ ఢమాల్’ సినిమాలో రీమిక్స్ చేశారు.

1977లో వచ్చిన ఇన్‌కార్ సినిమాలో ఉషా మంగేష్కర్ ‘ముంగ్డా’ పాట పాడారు. దానికి రాజేష్ రోషన్ సంగీతం అందించారు. సినిమాలో ఆ పాటను హెలెన్‌పై చిత్రించారు. రీమిక్స్‌లో ముంగ్డా పాటను సోనాక్షి సిన్హాపై చిత్రించారు.

లత డెక్కన్ క్రానికల్‌ పత్రికతో మాట్లాడుతూ, ‘రీమిక్స్‌ ముందు మమ్మల్ని ఎవరూ మా అనుమతి కోసం అడగడం లేదు. మా పాటల్ని ఆ రోజుల్లో చాలా మథనం తర్వాత సృష్టించే వారు. వాటిని రీమిక్స్ పేరుతో ఇష్టం వచ్చినట్లు మారుస్తున్నారు. ఇది కరెక్టేనా’ అన్నారు.

ఒరిజనల్ ముంగ్డాకు మ్యూజిక్ అందించిన రాజేష్ రోషన్ మాట్లాడుతూ, ‘ఈ రోజుల్లో చిత్ర నిర్మాతల దగ్గర కొత్త పాటలు సృష్టించే సృజనాత్మకత లేదు’ అన్నారు. గత సంవత్సరం ‘పాకీజా’ చిత్రంలోని లత పాట ‘చల్తే చల్తే’ను ‘మిత్రోం’ సినిమాకు ఇలాగే వాడుకున్నారు.

ఇన్‌కార్ సినిమాలోని ఒరిజనల్ హింట్ సాంగ్ కోసం కింద క్లిక్ చేయండి:

source: NDTV


Share

Related posts

Snoring: ఇలా చేస్తే గురక జన్మలో రాదు..!!

bharani jella

Organic Farming: కేవలం రూ.2400 తో పొలం అద్దెకు తీసుకుని 12 రకాల పంటలు పండించవచ్చు..! 

arun kanna

సన్నగా మారుస్తానని చెప్పి కూతురు వయసున్న ఫ్రెండ్ భార్యతో ఏం చేసాడో తెలుసా?

sowmya

Leave a Comment