NewsOrbit
న్యూస్ సినిమా

Lata Mangeshkar: లతాపై విష ప్రయోగం..!? 50 వేల పాటలు.. మంగేష్కర్ జీవిత విశేషాలు..!

Lata Mangeshkar

Lata Mangeshkar : లెజెండరీ సింగర్‌ లతా మంగేష్కర్‌ (92) కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. దీంతో యావత్ సంగీత ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. తన గానామృతంతో కోట్లాదిమంది ప్రజలను మైమరపించిన లతా మంగేష్కర్‌ ఇక లేరనే విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దిగ్గజ గాయని నేడు అంటే ఫిబ్రవరి 6న పొద్దున 8 గంటల 12 నిమిషాలకు ముంబై బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అయితే గాన కోకిల లతా స్వరం శాశ్వతంగా మూగబోయిన ఈ తరుణంలో ఆమె సంగీత ప్రపంచానికి ఎన్ని సేవలు చేశారో? ఆమె జీవిత విశేషాలు ఏంటో? ఆమెపై విష ప్రయోగం ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం.

Lata Mangeshkar : లైఫ్ & మ్యూజిక్ కెరీర్

Lata Mangeshkar

క్వీన్ ఆఫ్ మెలోడీ, నైటింగేల్ ఆఫ్ ఇండియాగా వెలుగొందిన లతా మంగేష్కర్… 1929 సెప్టెంబరు 28న మధ్యప్రదేశ్​లోని ఇండోర్​లో దీనానాథ్ మంగేష్కర్​, శుద్దమతి దంపతులకు మొదటి సంతానంగా జన్మించారు. ఆమె ఐదేళ్ల ప్రాయం నుంచే సంగీతం నేర్చుకోవడం ప్రారంభించారు. తన 13వయేటా ఆమె తండ్రి కన్నుమూశారు. దీంతో ఫైనాన్షియల్ గా ఫ్యామిలీకి సపోర్ట్ చేసేందుకు ఆమె ఆ వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి ప్లేబ్యాక్ సింగర్ గా ఎంట్రీ ఇచ్చారు. అలా 1942లో తొలిసారిగా ఒక మరాఠీ పాటతో సింగర్​గా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. మరాఠీ చిత్రం ‘కితీ హస్సల్’లోని “నాచు యా నా గాడే ఖేదు సారీ” అనే పాటను ఆమె పాడగా దాన్ని సినిమా నుంచి తొలగించారు. 1942 నుంచి 7 దశాబ్దాల్లో ఆమె 36 భారతీయ భాషలతోపాటు పలు విదేశీ భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.

Lata Mangeshkar

చాలా టాలెంటెడ్ సింగర్ అయిన ఆశా భోంస్లే లతా సోదరి అనే విషయం మనందరికీ తెలిసిందే. లతా ఒక్కరే కాదు ఆమె కుటుంబం నుంచి చాలామంది సినీరంగ ప్రవేశం చేశారు. ఆమె తండ్రి థియేటర్‌ను నడిపేవారు. ఆమె అక్కలు ఉష, మీయా ఇద్దరూ గాయకులే. పాపులర్ బాలీవుడ్ సినీ మ్యూజిక్ కంపోజర్ గులాం హైదర్ ఆమె పాపులర్ అవ్వడానికి కారణమయ్యారు. హైదర్ 1948లో మజ్బూర్ సినిమా కోసం ‘దిల్ మేరా తోడా’ పాట పాడమని లతకు ఆఫర్ ఇచ్చారు. ఈ పాటను అద్భుతంగా ఆలపించి ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు.

Lata Mangeshkar

భారత్-పాక్ విభజనలో ఖుర్షీద్, నుర్జహాన్ వంటి లెజెండరీ సింగర్స్ పాకిస్థాన్ వెళ్లిపోవడంతో లతా మంగేష్కర్ ఇండియాలో బెస్ట్ సింగర్​గా అవతరించారు. 1949 లో వచ్చిన మహల్ అనే మరాఠీ రొమాంటిక్ హారర్ ఫ్లిక్ లో ఆమె ఆయేగా ఆనే వాలా పాట పాడి శ్రోతల హృదయాలను దోచేశారు. ఈ ఒక్క పాటతో ఆమె కెరీర్ మలుపు తిరిగింది. తెలుగులో కూడా ఆమె పలు పాటలు పాడారు. మొట్టమొదటిగా ‘సంతానం (1955)’ సినిమా కోసం నిదుర పోరా తమ్ముడా అనే పాట పాడారు.

Lata Mangeshkar : అవార్డులు, గౌరవాలు

Lata Mangeshkar

1948-78 మధ్య కాలంలో ఏకంగా 30 వేలకు పైగా పాటలు పాడి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్​ రికార్డుల్లో తన పేరును లిఖించుకున్నారు. అంతేకాదు 1969లో పద్మభూషణ్, 1999లో పద్మ విభూషణ్, 2001లో భారతరత్న అవార్డులను గెలుచుకున్నారు. కె.ఎల్.సైగల్​ సాంగ్స్ ను లతా బాగా ఇష్టపడతారు. 1963 భారత్-చైనా యుద్ధ సమయంలో లతా ఆలపించిన అయే మేరే వతన్ కే లోగో పాట విని అప్పటి పీఎం జవహర్ లాల్ నెహ్రూ కంటతడి పెట్టుకున్నారు. Queen of Indian playback singers అని లతా మంగేష్కర్​ గురించి టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఒక స్టోరీ పబ్లిష్ చేసింది. 1999లో లతా ఎయు డె పెర్ఫ్యూమ్ (Lata Eau De Parfum) అనే పర్ఫ్యూమ్ రిలీజ్ చేశారు.

లతాపై విష ప్రయోగం

Lata Mangeshkar

1962లో గుర్తుతెలియని వ్యక్తులు లతా మంగేష్కర్​పై స్లో పాయిజన్ ప్రయోగించారు. ఈ విష ప్రయోగం వల్ల లతా చాలా క్షీణించి పోయారు. మంచంపై నుంచి లేవడానికి కూడా ఆమెకు చేత కాలేదు అంటే ఎన్ని రోజుల పాటు ఆమెపై స్లో పాయిజన్ ప్రయోగించడం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే తన గొంతు పోగొట్టేందుకు ఎవరో కావాలనే తనపై విష ప్రయోగం చేస్తున్నారని ఆమె తెలుసుకున్నారు. అప్పట్నుంచి ఆమె విష ప్రయోగం నుంచి కోలుకోవడానికి మూడు నెలల సమయం పట్టింది. అనంతరం ఆమె మళ్లీ తన గానామృతం తో సినీ ప్రేక్షకులను అలరించారు. 1962లో ఆమె తగు జాగ్రత్తలు తీసుకునేవారు. ఆ సమయంలో దివంగత బాలీవుడ్ లిరిసిస్ట్ మజ్రూహ్ సుల్తాన్‌పురి మొదట ఆమె ఆహారాన్ని రుచి చూసి టెస్ట్ చేసేవారు.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu