29.2 C
Hyderabad
March 21, 2023
NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Mahabeera: మహాబీర చెట్టు విత్తనాలు చేసే అద్భుతం ఏంటో తెలుసా..!?

Share

Mahabeera: మహాబీర చెట్టు ను మన చుట్టుపక్కల చూస్తూనే ఉంటాం.. దీని ప్రయోజనాలు తెలియక చాలా మంది దీనిని చెప్పి భావిస్తూ ఉంటారు.. ఇది చూడటానికి తులసి మొక్క లా ఉంటుంది.. కాకపోతే దీని ఆకులు కొంచెం పెద్దగా ఉంటాయి.. మహాబీర విత్తనాలు మోకాళ్ళ నొప్పులకు అద్భుతంగా పని చేస్తాయి.. మహాబీర చెట్టు విత్తనాలు వలన మన ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి తెలుసుకుందాం..!!

Mahabeera: plant seeds health benefits
Mahabeera: plant seeds health benefits

Mahabeera: మహాబీర చెట్టు విత్తనాలు మోకాళ్లు, కీళ్ళు, నడుము నొప్పిలకు చెక్..!!

ఈ చెట్టును మహావీర తులసి, సీమా తులసి, గంధ తులసి, శిర్ణ తులసి, కొండ తులసి, అడవి తులసి అని కూడా పిలుస్తారు.. ఈ చెట్టు నుండి ఒక విధమైన సువాసన వస్తుంది. ఈ చెట్టు రోడ్లకు ఇరుపక్కలా విస్తారంగా కనిపిస్తుంది. దాదాపు ఈ మొక్క దొరికే ప్రదేశం ఉండదు ఇది తులసి జాతికి సంబంధించిన మొక్క మహాబీర చెట్టు కుటుంబానికి చెందినది తులసి ఆకులను పోలి ఉంటాయి. అయితే ఈ ఆకులు కొంచెం పెద్దగా ఉంటాయి. ఈ చెట్టు పువ్వులకు విత్తనాలు ఉంటాయి. ఈ విత్తనాలను మహాబీర విత్తనాలు విత్తనాలు అంటాము.. ఈ విత్తనాలు అరిగిపోయిన గుజ్జు తిరిగి వచ్చేలా చేస్తుంది..

Mahabeera: plant seeds health benefits
Mahabeera: plant seeds health benefits

మహాబీర విత్తనాలు రాత్రి పూట ఒక గ్లాస్ నీటిలో వేసి నానబెట్టాలి ఉదయం లేచాక పరగడుపున ఈ నీటిని తాగాలి. మహాబీర విత్తనాలు నీటిలో వేస్తే సబ్జా గింజల మాదిరిగా తెల్లగా అవుతాయి. కానీ ఈ గింజలకు జిగురు లాంటి పదార్థం ఉంటుంది. ఇదే మోకాలు లో గుజ్జును వచ్చేలా చేస్తుంది. తాగాలి తాగుతుంటే క్రమంగా మోకాళ్ళ లో గుజ్జు పట్టేలా చేస్తుంది. ఈ విధంగా మూడు నెలలు ఈ నీటిని తాగుతుంటే మోకాలు నొప్పులు తగ్గుతాయి. ఈ విధంగా మూడు నెలలు చేస్తే చాలు మార్పును మీరూ గమనిస్తారు. అంతే కాదు ఇలా తాగడం వల్ల నడుం నొప్పి కూడా తగ్గిస్తుంది. నడుము నొప్పితో బాధపడతారు అలాంటి వారు ఈ విధంగా పరగడుపున ఈ నీటిని తాగితే నొప్పి తగ్గిపోతుంది. మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుం నొప్పి, వెన్ను నొప్పి తగ్గుతుంది.

Mahabeera: plant seeds health benefits
Mahabeera: plant seeds health benefits

ప్రతిరోజు పరగడుపున నీటిలో నానబెట్టిన మహాబీర విత్తనాలను తాగితే ఒంట్లో కొవ్వును కరిగించి బరువు తగ్గేలా చేస్తుంది. అంతే కాదు వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో ఫ్రీరాడికల్స్ తో పోరాడుతాయి. క్యాన్సర్ కణాలను నిరోధిస్తాయి. కాన్సర్ తగ్గించే శక్తి కూడా ఈ విత్తనాలు కూడా ఉంది తాగడం వల్ల శరీరంలోని క్యాన్సర్ కణాలపై పోరాడుతుంది. క్యాన్సర్ దరిచేరకుండా కాపాడుతుంది.

Mahabeera: plant seeds health benefits
Mahabeera: plant seeds health benefits

ఈ చెట్టు ఆకులను ముద్దగా నూరి రసం తీసుకోవాలి గజ్జి, తామర, దురద ఉన్న చోట రాస్తే త్వరగా తగ్గుతాయి. అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యలకు ఈ ఆకులు చక్కగా పనిచేస్తాయి. ఈ ఆకులను ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి ఆ నూనె నీటితో కడిగేయాలి. చర్మం పై ఉన్న గజ్జి, తామర, అలర్జీ అన్ని తగ్గుతాయి. పుండ్లు, గాయాలు ఉన్నచోట ఈ ఆకుల రసాన్ని రాయాలి ఇలా రాయటం వల్ల త్వరగా గాయాలు మానిపోతాయి. అరికాళ్ళు పగిలిన అట్లయితే ఈ ఆకుల రసాన్ని రాస్తే పాదాలు మృదువుగా తయారవుతాయి. ఆకుల రసాన్ని పాము కాటు విరుగుడు ఉపయోగిస్తారు. ఈ ఆకుల రసాన్ని తీసి కట్టు కడితే పాము విషం శరీరానికి పాకదు.


Share

Related posts

Amritha Aiyer New HD Photos

Gallery Desk

Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ తో అరియనా..!!

sekhar

Ear Wax: చెవిలో గులిమి ఎందుకు వస్తుందో తెలుసా.. గులిమి తీసేటప్పుడు చేసే పొరపాట్లు ఇవే..!!

bharani jella