Black Fungus: ఆక్సిజన్
కరోనా బాధితులకు అత్యంత అవసరం అయినది ఆక్సిజన్. ఈ ఆక్సిజన్‌ను ఆక్సిజన్ హ్యూమిడిఫయ్యర్ల తో అందించాల్సి ఉంటుంది అనేది తెలిసిన విషయమే. అయితే ప్రాణాలు నిలబెట్టేందుకు వాడుతున్న ఈ హ్యూమిడిఫయర్లే అనేకమంది రోగులను బ్లాక్ ఫంగస్ బారిన పడేలా చేస్తున్నాయి. ఎందుకంటే ఆక్సిజన్ హ్యూమిడిఫయర్లలో స్టెరైల్ వాటర్ ను నింపి వాడాలి.
Black Fungus: ప్రతి 12 గంటలకు
కానీ ప్రస్తుతం అనేక ప్రైవేటు హాస్పిటల్స్ లో , ఇళ్లలో చికిత్స పొందుతున్న అనేకమంది హ్యుమిడిఫయర్లలో సాధారణ నీటిని వాడుతున్నారు. ఇలా వాడడం వల్ల ఆ నీటిలో ఉన్న బ్యాక్టీరియా,సూక్షక్రిములు, ఫంగస్ వంటి అనేక హానికరమైన జీవులు డైరెక్ట్ గా శ్వాసకోశంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇలాంటి ప్రమాదాల వల్లే బ్లాక్ ఫంగస్ కూడా విస్తృతం గా వ్యాప్తి చెందుతుంది అని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు.‘హ్యుమిడి
మెదడు,కళ్లు, ముక్కు, పళ్లపై ఈ ఫంగి ప్రభావం చూపుతుందని నిపుణులు తెలియచేస్తున్నారు.
Black Fungus: జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటేనే
మరి కొన్ని చోట్ల కొందరు ఆవు పేడను, మూత్రాన్ని శరీరానికి అప్లై చేసుకుని దానిని వైద్యంగా చెబుతున్నారు. కానీ అలా చేయడం వల్ల మ్యుకర్‌మైకోసిస్ తో పాటు ఇతర ఫంగస్ ఇన్ఫెక్షన్లు కూడా దాడి చేసే ప్రమాదం ఉందని జాగ్రత్త వహించాలి అని నిపుణులు తెలియచేస్తున్నారు. కాబట్టి ఈ కరోనా కాలం లో ప్రతి విష్యం లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటేనే మంచిది.. ఏమాత్రం అశ్రద్ధ వహించిన ప్రమాదం తప్పదు.