Mahesh babu: సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో అతడు, ఖలేజా ట్రెండ్ సెట్టర్ సినిమాలని చెప్పవచ్చు. రెండు సినిమాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. మహేష్ బాబు నటన లో కొత్తదనాన్ని ఈ రెండు సినిమాల ద్వారా త్రివిక్రమ్ బయట పెట్టడం జరిగింది. గమ్మత్తేమిటంటే ఈ సినిమాలు సినిమా ధియేటర్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా గానీ టెలివిజన్ రంగంలో మాత్రం.. ఇప్పటికీ కూడా అలరిస్తూ ఉంటాయి.
ఇదిలా ఉంటే త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ సినిమా చేసి దాదాపు 11 సంవత్సరాలు కావచ్చు ఈ క్రమంలో ఎప్పటినుండో వీరి కాంబినేషన్లో మూడో సినిమా రావాలని అభిమానులు కోరుకుంటున్న తరుణంలో ఈ ఏడాదిలో.. మూడో సినిమా అధికారికంగా ప్రకటించడం జరిగింది. హారిక హాసిని నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
Read more: Mahesh Babu: బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్ తో మహేష్ భారీ ప్రాజెక్ట్..??
మహేష్ బాబు కెరీర్లో 28వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే త్రివిక్రమ్ కంప్లీట్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలలో టాక్. ఇదిలా ఉంటే త్రివిక్రమ్ గత కొన్ని సినిమాల నుండి సీనియర్ హీరోయిన్లకి మంచి క్యారెక్టర్ లో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అత్తారింటికి దారేది సినిమాలో నదియా, అజ్ఞాతవాసి సినిమా లో కుష్బూ, అలా వైకుంఠపురం లో సినిమాలో టబు.. చేత యాక్టింగ్ చేయించిన త్రివిక్రమ్ ఇప్పుడు మహేష్ బాబు తో చేయబోయే సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి నటింప చేస్తున్నట్లు మొన్నటివరకు వార్తలు తాజాగా.. నయనతార చేత కీలక క్యారెక్టర్ చేయించి ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాకే ఈ క్యారెక్టర్ హైలైట్ అన్నట్లు అందువల్లే నయనతారని తీసుకోవాలనే ఆలోచనలో త్రివిక్రమ్ ఆలోచనలు చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!