Mehreen Kaur : టాలీవుడ్ నటి మెహ్రీన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. అవును.. పరిశ్రమ, ఆర్టిస్టుల జీవితాలపై ఈ అమ్మడు ఆవేదనాపూరిత వ్యాఖ్యలు చేయడం ఇపుడు సంచలనంగా మారింది. ఆర్టిస్టుల జీవితాలే చాలా చిత్రంగా ఉంటాయని, జీవితంలో ఎలాంటి గ్యారంటీలేని బతుకులని ఈ సందర్భంగా తెలిపింది. అయినా అలాంటి అస్థిర జీవితాలను తాము ఇష్టపూర్వకంగానే ఎంచుకుంటామని చెప్పింది. సినిమా కోసం తమ శరీరాలను తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని తెలిపింది.
Mehreen Kaur : ఇక్కడ అవి ఆరోగ్యానికి నష్టమని తెలిసినా చేయక తప్పదు?
తాజాగా ఓ మీడియా వేదికగా ఈమె తన మనసులోని బాధను వెళ్లగక్కారు. ఈ పరిశ్రమలో ఎన్నో ఎత్తుపల్లాలను చూస్తుంటామని, కొన్నికొన్ని సార్లు అధ:పాతాళానికీ వెళ్లిపోతుంటామని పేర్కొంది. కొన్ని అలవాట్లు ఆరోగ్యానికి నష్టమని తెలిసినా ఇక్కడ చేయక తప్పదని పరోక్షంగా మాట్లాడింది. ఒక్కోసారి రాత్రికి రాత్రి అడ్డమైన ఫోన్లు వస్తుంటాయని అంది. అరుదుగా ఇక్కడ విజయాలు సాధిస్తుంటామని, మరికొన్ని సార్లు వైఫల్యాలను చూస్తామని తెలిపింది. ఈ క్రమంలో ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా సినీ జీవితంలో భాగంగా తాము అన్నిటికీ అలవాటు పడ్డామని ఆవేదన వ్యక్తం చేసింది.
ఏమి చేసినా కళ కోసమే?
ఇక్కడ ఆకలి, నిద్ర, బాధ అన్నింటికీ ఓర్చుకుని పనిచేస్తామంది. అలాగే ఎండనకా, వాననక, పగలు, రాత్రుళ్లన్న తేడా లేకుండా రోజులు, వారాల పాటు కష్టపడుతుంటామని తెలిపింది. ఇంటికి, కుటుంబానికి, స్నేహితులకు దూరంగా ఉంటూ.. సోషల్ లైఫ్ ని మిస్ అవుతూ మరింత ముందుకు పోవాలన్న ఉద్దేశంతో పనిచేస్తుంటామని చెప్పింది. ఏది చేసినా.. ఎంత కష్టపడినా.. అంతిమంగా కళ కోసమేనని ఆమె తెలిపింది.