వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి ఎక్కడ?

తుళ్లూరు: గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కనిపించడం లేదని తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో కొందరు మహిళలు ఫిర్యాదు చేశారు. తమ ఎమ్మెల్యే గత కొన్ని రోజులుగా కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యేను వెతికి పెట్టాలని పోలీసులకు మహిళలు విజ్ఞప్తి చేశారు. తమ సమస్యల్ని చెప్పుకుందామంటే తమ ఎమ్మెల్యే పత్తా లేకుండా పోయారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనపై గత వారం రోజులుగా అమరావతి ప్రాంత రైతులు, ప్రజలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం(డిసెంబర్ 23) మంగళగిరి ఎమ్యేల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కనబడటంలేదంటూ మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో రైతులు ఫిర్యాదు చేశారు. రాజధాని తరలిపోతుందని తాము ఆందోళనలు చేస్తుంటే.. ఎమ్మెల్యే ఆళ్ల అడ్రస్ లేకుండా పోయారని ఆరోపించారు. ఆయన కనిపిస్తే వెతికి పెట్టడంటూ కోరారు.