మీ పిల్లలకు మీ సంపదను వారసత్వంగా ఇవ్వాలనుకుంటేదానికి ముందునుంచే వారిని దానికి అనుగుణంగా మలచుకోవాలి.దానికోసం ముందుగా వారికి ఆర్థిక అక్షరాస్యత నేర్పాలి. ఈ రోజుల్లో పిల్లలకు పాటలు డ్యాన్స్, పాడటం, కరాటే, సంగీతం లాంటివి నేర్పించేందుకు తల్లిదండ్రులు శ్రద్ధ చూపిస్తుంటారు కానీ… ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలకు డబ్బు పాఠాలు నేర్పించాలని అనుకుంటారు?
అలాఅనుకునే వారు చాలా తక్కువ మంది ఉంటారు.అసలు పిల్లలకు ముందుగా నేర్పించవలిసింది డబ్బు పాఠాలే అని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే పిల్లలు చదువు ముగించు కొని ఈ ప్రపంచం లో అడుగుపెట్టారంటే ఇక వారి జీవితం అంతా డబ్బు చుట్టే తిరుగుతుంది. అందుకే డబ్బును ఎలా ఖర్చు పెట్టాలో, బడ్జెట్‌ని ఎలా ప్లాన్ చేసుకోవాలో పిల్లలకు నేర్పించడం చాల అవసరం.
తల్లిదండ్రులు పిల్లలకు పాకెట్ మనీ ఇస్తుంటారు.అలా ఇవ్వడం తో పాటు డబ్బు విలువ ఏంటో కూడా తెలియజేయాలి.ఎలాంటి అవసరాల కోసం డబ్బు వాడాలో కూడా తెలిసేలా చేయాలి. స్కూళ్లు, కాలేజీల్లో ఆర్థిక అక్షరాస్యత గురించిపాఠాలు చెప్తే చాల ఉపయోగం గా ఉంటుంది.ఆదాయం, ఖర్చులు, పొదుపు ఎలా మేనేజ్ చేసుకోవాలి అన్నది నేర్పించాలి.చాలామంది తల్లిదండ్రులు పిల్లలు డబ్బు ఆదా చేసేందుకు పిగ్గీ బ్యాంక్స్ ఇస్తుంటారు..అది మంచి పని కూడా..అయితే దాచుకున్న డబ్బు తో ఏమేమీ చేయవచ్చో మాత్రం పిల్లలకి వివరించారు.
మీ ఇంటి బడ్జెట్ ఎలా వేసుకుంటారో పిల్లలకు వివరంగా చెప్పాలి.ఫైనాన్షియల్ ప్లానింగ్‌కు సంబంధించి జరిపే చర్చల్లో పిల్లల్ని కూడా భాగస్వాముల్ని చేయాలి. మీ ఆదాయం,ఇంటి ఖర్చులు,పొదుపు ఎలా చేస్తున్నారో చెప్పాలి. ఇన్సూరెన్స్ పాలసీ, పొదుపు యొక్క ప్రాముఖ్యతను వారికీ అర్ధమయేలా వివరం గా చెప్పాలి. మీ పెట్టుబడులు, వాటి ద్వారా వచ్చే ఆదాయం గురించి వారికీ తెలియచేయాలి. కేవలం ఆదాయం, ఖర్చులు గురించి మాత్రమే కాదు, పన్నుల గురించి కూడా వివరించాలి.
ఒకవేళ డబ్బులు లేనప్పుడు లేదా అనుకోని అవసరం వచ్చినప్పుడు ఆ పరిస్థితిని ఎలా అధిగమించాలి… కొత్త వ్యాపారం మొదలుపెట్టలంటే ఏం చేయాలి?ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వారికి వారసత్వంగా రాబోయే ఆస్తులేంటీ అన్నవి వివరం గా తెలియజేయాలి.పిల్లలకు 5 నుంచి 12 ఏళ్ల మధ్య డబ్బు పాఠాలు నేర్పిస్తేసరిపోతుంది.
చిన్నప్పుడే వాళ్లకు డబ్బు విలువను, ఖర్చు చేసేవిధానాన్ని అలవాటు చేయడం వలన పిల్లలుటీనేజ్లోకి వచ్చేసరికి ఆర్థిక అక్షరాస్యత వచ్చేస్తుంది. స్నేహితుల్లా బ్రాండెడ్ దుస్తులు ,గ్యాడ్జెట్స్ కోసం తాము కూడా డబ్బులు ఖర్చు చేయాలన్న ఆలోచనలు తగ్గుతాయి. మీతో పాటు షాపింగ్‌కు తీసుకెళ్లాలి. వాళ్ల చేతుల మీదు గానే డబ్బు ఖర్చు చేయాలి. ఏటీఎం నుండి డబ్బులు డ్రా చేయించాలి. అవసరమైతే పిల్లలకు డబ్బు పాఠాలు నేర్పేందుకు ప్రొఫెషనల్స్ సాయం పొందవచ్చు.